Kundali Lord Zodiac Signs: జన్మ, నామ నక్షత్రంతో మీ శిచక్రం ప్రకారం అధిదేవత ఎవరో తెలుసా..! ఎలా గుర్తించాలంటే..!
ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే అతను జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఆధారంగా దేవుడిని పూజించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి నక్షతానికి అధిపతియైన దేవతలను పూజిస్తే.. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొని.. పనులను సులభంగా పూర్తి...

Kundali Lord Zodiac Signs: ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే అతను జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఆధారంగా దేవుడిని పూజించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి నక్షతానికి అధిపతియైన దేవతలను పూజిస్తే.. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొని.. పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు. సుఖసంతోషాలతో జీవిస్తారు. అయితే మీ జాతకానికి సరిపోయే అధిదేవతలను గుర్తించడం ఎలా అన్నది చూద్దాం.. !
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుకోవచ్చు.. అదే పుట్టిన తేదీ సమయం తెలియని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ప్రధాన దేవతను గుర్తించవచ్చు. ఇక సదరు వ్యక్తి గత జన్మలో చేసిన పనులు కూడా అధిదేవతలు నిర్ణయించబడతాయి.
మనిషి జాతకం ప్రకారం అధిదేవతను నిర్ణయించడానికి జాతకంలోని కుండలిని పరిశీలిస్తారు. అతని రాశి చక్రంలోని ఐదవ స్థానాన్ని బట్టి ప్రధాన దేవతను నిర్ణయిస్తారు. దీంతో అతని జాతకంలో ఏర్పడిన గ్రహ దోషాలను తొలగించి సుఖ సంతోషాలను కలగడానికి ఆ రాశి యొక్క దేవతలను ఆరాధించే విధివిధానాలను సూచిస్తారు.
రాశిచక్రం ప్రకారం మీ ప్రధాన దేవతను తెలుసుకోండి:
మేషం మరియు వృశ్చికం – ఈ రెండు రాశుల అధిదేవత అంగారకుడు, కనుక ఈ రాశి యొక్క ప్రధాన అధిదేవత శ్రీరాముడు, హనుమంతుడు
వృషభం మరియు తుల – ఈ రెండు రాశుల అధిపతి శుక్రుడు. కనుక శుక్రుడుకి ఇష్టమైన దేవత దుర్గ.. కనుక ఈ రాశులవారు దుర్గాదేవిని పూజించాలి.
మిథునం మరియు కన్య – ఈ రాశుల అధినాయకుడు బుధుడు. దీంతో ఈ రాశుల గల వ్యక్తులు వినాయకుడు, విష్ణువును పూజించాలి.
కర్కాటక – ఈ రాశి అధిదేవత చంద్రుడు. ఈ రాశిలో జన్మించినవారు శివుడిని పూజించాలి.
సింహం రాశి – ఈ రాశిచక్రానికి ప్రభువు సూర్యుడు. ఈ రాశి లో పుట్టినవారు ప్రధాన దేవతలైన ఆంజనేయస్వామిని, తల్లి గాయత్రీ మాతను పూజించాలి.
ధనుస్సు మరియు మీనం – ఈ రాశి చక్ర యజమాని గురు.. కనుక గురువు కు ఇష్టమైన విష్ణు , లక్ష్మిలను పూజిస్తే అన్ని శుభఫలితాలు ఏర్పడతాయి.
మకరం మరియు కుంభం– ఈ రెండు రాశిచక్రాల అధినాయకుడు శని. కనుక ఏఈ రాశిలో జన్మించినవారు ప్రధాన దేవతలుగా హనుమంతుడు, శివుడి ని పూజిస్తే.. ప్రత్యేక ఫలితాలు పొందుతారు.
Also Read: