Lord Sai Baba Devotees: ‘సబ్‌కా మాలిక్ ఏక్‌హై’..సాయి స్మరణలో ముస్లిం భక్తులు.. ప్రత్యేక పూజలు
సాయిబాబాకు చందనం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు ముస్లిం భక్తులు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో హిందూ ముస్లింలు కలిసి కట్టుగా...
Lord Sai Baba Devotees: సాయిబాబాకు చందనం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు ముస్లిం భక్తులు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో హిందూ ముస్లింలు కలిసి కట్టుగా ఉంటామని మరోమారు నిరూపించుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గత 24 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 14న జాతరను పురస్కరించుకుని.. మేము సైతం అన్నట్టు హిందువులతో ముస్లిం భక్తులు ప్రతి ఏటా కలిసిమెలిసి జాతరను నిర్వహిస్తారు.గా ప్రతి సంవత్సరంలాగే.. ఈ సారి కూడా సన్నాయి వాయిద్యాలతో సాయిబాబాకు చందనం, పూలు, పండ్లు, స్వీట్లు తెచ్చి పూజారులతో ప్రత్యేక పూజలు చేయించారు. పూజానంతరం..అందరూ కలిసి బాబా ప్రసాదాన్ని స్వీకరించారు.
‘సబ్‌కా మాలిక్ ఏక్‌హై’ అన్న బాబా మాటల ప్రకారం మేమంతా ఒక్కటిగా కలిసి మెలిసి ఉంటామని ఈ ముస్లిం భక్తులు చెబుతున్నారు. అనంతరం ఆలయ పూజారులు వారికి శాలువాలు కప్పి సన్మానం చేశారు.
Also Read:
Vitamin D in rice: తెలంగాణ రైతు అద్భుత సృష్టి.. ‘డి’ విటమిన్ బియ్యంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి
తూర్పు గోదావరి జిల్లాలో కలకలం.. ఐదు రోజుల క్రితం భర్త హత్య, తాజాగా భార్య ఆత్మహత్య.. ఏంటీ మిస్టరీ!