తూర్పు గోదావరి జిల్లాలో కలకలం.. ఐదు రోజుల క్రితం భర్త హత్య, తాజాగా భార్య ఆత్మహత్య.. ఏంటీ మిస్టరీ!

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త హత్యకు గురైన ఐదు రోజులకే భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పిఠాపురంకు చెందిన శ్రీపాద వల్లభ మహాసంస్థానం ఎదురుగా...

తూర్పు గోదావరి జిల్లాలో కలకలం..  ఐదు రోజుల క్రితం భర్త హత్య, తాజాగా భార్య ఆత్మహత్య.. ఏంటీ మిస్టరీ!
Women death
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 13, 2021 | 4:33 PM

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త హత్యకు గురైన ఐదు రోజులకే భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పిఠాపురంకు చెందిన శ్రీపాద వల్లభ మహాసంస్థానం ఎదురుగా ఉన్న వీధిలో ఈ నెల 8న రెడ్డెం శ్రీనివాస్‌ను క్రూరంగా మర్డర్ చేశారు. కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపాంరు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. హత్యకు దారి తీసిన కారణాలపై విచారణ సాగిస్తున్నారు.

ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాస్‌ భార్య స్వరూపారాణి కాస్త నలతగా ఉందని.. విశ్రాంతి తీసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని తనువు చాలించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు డెడ్‌బాడీని కిందికి దింపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోవడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భార్యాభర్తల మృతితో కుటుంబ సభ్యులు, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

శ్రీనివాస్‌ మొదటి భార్య చనిపోవడంతో ఏడేళ్ల క్రితం స్వరూప రాణిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే ఆయనకు కృష్ణవంశీ, గీతిక అనే ఇద్దరు పిల్లలున్నారు. స్వరూపారాణికి ఒక కుమారుడు వరుణ్‌ సంతోష్‌ ఉన్నాడు. శ్రీనివాస్‌ తండ్రి సత్తిరాజుతో పాటు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. భార్యాభర్తలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారని.. ఇలా ఎందుకు జరిగిందో తెలియంలేదని కుటుంబ సభ్యులు, బంధువులు అంటున్నారు.

Also Read:

Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!