AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

No Entry for Men: ఆ గ్రామంలో మగవారికి నో ఎంట్రీ.. ఒకప్పటి అత్యాచారానికి ఇప్పటికీ ప్రతీకారం! నో కాంప్రమైజ్

ప్రపంచంలో ఏ దేశంలోనైనా పురుషాధిక్యం తప్పదేమో.. భర్తగా మారిన తర్వాత కొందరు మగవారు .. భార్యపై తన ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటారెమో అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.. ఇక అత్యాచారాలకు గురై.. భర్తల వేధింపులను భరించలేక...

No Entry for Men: ఆ గ్రామంలో మగవారికి నో ఎంట్రీ.. ఒకప్పటి అత్యాచారానికి ఇప్పటికీ ప్రతీకారం! నో కాంప్రమైజ్
Surya Kala
|

Updated on: Feb 13, 2021 | 6:57 PM

Share

No Entry Board for Men in Village: ప్రపంచంలో ఏ దేశంలోనైనా పురుషాధిక్యం తప్పదేమో.. భర్తగా మారిన తర్వాత కొందరు మగవారు .. భార్యపై తన ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటారెమో అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.. ఇక అత్యాచారాలకు గురై.. భర్తల వేధింపులను భరించలేక మగవారి ఫై నమ్మకం కోల్పోయిన కొంతమంది మహిళలు తమకు తామే అండ అంటూ ఓ ఊరినే నిర్మించుకున్నారు. అంతేకాదు ఆ గ్రామంలో ప్రవేశమార్గం వద్ద పురుషులకు ప్రవేశం లేదంటూ అంటూ నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టేశారు.. ఈ ఊరు ఎక్కడ ఉందనుకుంటున్నారా.. కెన్యా దేశంలో వివరాల్లోకి వెళ్తే..

కెన్యాలోని సంబురు తెగలో పురుషాధిక్యత ఎక్కువ. ఆడవాళ్లు కేవలం పిల్లలను కనడానికి పనికొస్తారు అనే భావన నెలకొంది.. ఇక ఈ తెగలో బలవంతవు వివాహాలు, గృహ హింస ఇక్కడ సర్వ సాధారమనే చెప్పుకోవచ్చు..అయితే ఓ ఘటన ఈ తెగలోని మహిళల జీవితాన్నే మార్చేసింది. ఏకంగా ఓ గ్రామం ఏర్పాటు చేసేందుకు దారి తీసింది.

కౌంటీలోని ఉమోజా ఉసో గ్రామంలో ముఫై ఏళ్ల క్రితం ఈ గ్రామం ఏర్పడింది. ఈ గ్రామంలో సంబురు తెగకు చెందిన మహిళలు కొంతమంది గుడిసెలు నిర్మించుకుని నివాసముంటున్నారు. కట్టెలు, గడ్డి, మట్టి, ఆవు పేడతో కుటీరాలను నిర్మించుకున్నారు. అంతేకాదు తమ గుడిసెల చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రామంలో మొత్తం 50మంది వరకూ మహిళలు ఉంటారని తెలుస్తోంది. వారందరూ తమ సాంప్రదాయ దుస్తులనే ధరిస్తారు. ఈ మహిళలకు అబ్బాయిలంటే వారికి 18 ఏళ్ళు వచ్చే వరకు తల్లుల వద్ద పెరగవచ్చు అయితే అమ్మాయి అయితే జీవితాంతం ఈ ఊరిలోనే ఉండవచ్చు.

ఈ గ్రామం ఏర్పాటు వెనుక ఓ రీజన్ ఉందని తెలుస్తోంది.. సంబురు తెగకు చెందిన 1400 మందికిపైగా మహిళలు మూడు దశాబ్దాల కిందట అత్యాచారానికి గురయ్యారు. సైనికులే అత్యాచారం చేశారట. దీంతో బాధితులను వారి భర్తలు ఇంట్లో నుంచి గెంటేశారు. అప్పటి నుంచి మహిళలందరూ వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తెగకు చెందిన రెబకా అనే మహిళ 1990లో 15 మందితో కలిసి గుడిసెలను కట్టుకుని గ్రామం ఏర్పాటు చేసుకున్నారు. ఉమోజా గ్రామంగా పేరు పెట్టారు. కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ చేయూతతో వీరి సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్నారు. వచ్చిన డబ్బుల్లో 10 శాతం గ్రామానికి పన్ను కడుతూ పిల్లల కోసం పాఠశాల నిర్వహణ, గ్రామాభివృద్ధి పనులు చేపడుతున్నారు. అంతేకాదు తమ గ్రామంలో పురుషులకు ప్రవేశం లేదని స్పష్టంగా చెప్పేసారు.. మహిళలు మాత్రం నివసించడానికి వీరు చేయుత నిస్తారు.

Also Read:

 సైన్స్‌కే సవాల్.. గర్భంతో ఉన్న మహిళ మూడు వారాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ!

పుత్రోత్సాహంతో మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్..