AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: పుత్రోత్సాహంతో మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్..

Chiranjeevi Reaction On Ram Charan-Shankar Movie: ‘కుమారుడు జన్మించినప్పుడు కాదు.. ఆ బిడ్డ గొప్ప పేరు సంపాదించుకున్నప్పుడు తండ్రి గర్వపడతారని’ చెబుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి....

Chiranjeevi: పుత్రోత్సాహంతో మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్..
Narender Vaitla
|

Updated on: Feb 13, 2021 | 5:30 PM

Share

Chiranjeevi Reaction On Ram Charan-Shankar Movie: ‘కుమారుడు జన్మించినప్పుడు కాదు.. ఆ బిడ్డ గొప్ప పేరు సంపాదించుకున్నప్పుడు తండ్రి గర్వపడతారని’ చెబుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకున్న తమిళ దర్శకుడు శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో చెర్రీ నటిస్తుండడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక అభిమానులతో పాటు ఆయన తండ్రి మెగా స్టార్ చిరంజీవి కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న చిరు.. చెర్రీపై పొగడ్తలు కురిపించారు. శంకర్‌తో సినిమా చేయనున్నట్లు చెర్రీ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన చిరు.. ‘గొప్ప దర్శకుడు, దూరదృష్టి కలవాడు.. తన సినిమాలతో సరిహద్దులను చెరిపే శంకర్‌తో రామ్ చరణ్ చేతులు కలపడం నాకు చాలా థ్రిల్లింగ్ కలిగించింది. భారత ఖ్యాతిని పెంచే దర్శకులతో నువ్వు (చెర్రీని ఉద్దేశిస్తూ) వరుస సినిమాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ లక్‘ అంటూ చిరు ట్వీట్ చేశారు. ఇక చెర్రీ-శంకర్ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Also Read: Kajal Smoking Cigarette: సిగరెట్ తో దమ్ము మీద దమ్ము అంటున్న చంద్రమామ.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు రీజన్ ఏమిటంటే