AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyper Aadi Marriage Soon : త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న హైపర్ ఆది.. అమ్మాయి ఎవరో తెలుసా..!

గత కొన్నేళ్లుగా బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న షో జబర్దస్త్ .. ఈ షో ద్వారా ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటనంటే ఇష్టమున్నా అవకాశాల కోసం ఎదురుచూసే చాలామందికి ఈ షో లైఫ్ ఇచ్చింది. చాలా మందిని జబర్దస్త్ ఆదరించింది..

Hyper Aadi Marriage Soon : త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న హైపర్ ఆది.. అమ్మాయి ఎవరో తెలుసా..!
Surya Kala
|

Updated on: Feb 13, 2021 | 7:19 PM

Share

Hyper Aadi Marriage Soon : గత కొన్నేళ్లుగా బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న షో జబర్దస్త్ .. ఈ షో ద్వారా ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటనంటే ఇష్టమున్నా అవకాశాల కోసం ఎదురుచూసే చాలామందికి ఈ షో లైఫ్ ఇచ్చింది. చాలా మందిని జబర్దస్త్ ఆదరించింది.వారిలోని మంచి నటనను వెలికితీసింది. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ షో‌లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, స్క్రిప్ట్ రైటర్‌‌గా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది. తన కామిడీ టైమింగ్ తో.వరస పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు . అనతికాలంలోనే బుల్లితెరపై తన పంచులతో ఒక రేంజ్ తనకంటూ ఓ ఫేమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. జబర్ధస్త్ టీం లీడర్స్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.

జబర్దస్త్ లో తన పంచులతో నవ్వించే హైపర్ ఆది వరసగా సినిమా ఆఫర్లను కూడా అందిపుచ్చుకుంటున్నాడు. అంతేకాదు ఢీ షో లో కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ షో లో వర్షిణితో చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై పుకార్లు షికారు చేశాయి.. వీటికి చెక్ పెడుతూ.. హైపర్ ఆది ఇంట్లో పెళ్ళికి ముహర్తం పెట్టారని తెలుస్తోంది.

ఆది కుటుంబం ఒక అమ్మాయిని కూడా ఫిక్స్ చేశారట వాళ్ళ చుట్టాల అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.ప్రస్తుతం ముహుర్తాలు లేనందున మే నెలలో హైపర్ ఆది పెళ్లి చేసేలా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ విషయంపై హైపర్ ఆది త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి హైపర్ ఆది కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలో పెళ్లి విషమై అధికారికంగా ప్రకటన చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Also Read:

పుత్రోత్సాహంతో మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్..

 సిగరెట్ తో దమ్ము మీద దమ్ము అంటున్న చంద్రమామ.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు రీజన్ ఏమిటంటే