Varudu Kaavalenu Song: మరోసారి అందమైన ప్రేమ గీతంతో మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్
యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమానుంచి...
Varudu Kaavalenu Song: యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన ప్రేమ గీతం విడుదల చేశారు చిత్రయూనిట్. ‘కోల కళ్ళే ఇలా’ అనే మెలోడీ సాంగ్ ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.సింగర్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మరోసారి మెస్మరైజ్ చేసాడు. ఈ మెలోడీ సాంగ్ కి రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇక సమ్మర్ కానుకగా ఈ సినిమా ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.