Kajal Smoking Cigarette: సిగరెట్ తో దమ్ము మీద దమ్ము అంటున్న చంద్రమామ.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు రీజన్ ఏమిటంటే

సమాజం మీద సెలబ్రెటీల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది.. ముఖ్యంగా సినీ, క్రీడాకారులను అభిమానించేవారు అనుకరించే వారు ఎక్కువగా ఉంటారు. అందుకనే ప్రముఖ కంపెనీలు వస్తువుల ప్రకటనలో కూడా ఎక్కువుగా సినీ సెలబ్రెటీలనే తీసుకుంటారు..తాజాగా ఓ సిని హీరోయిన్ సిగరెట్ ను పట్టుకుని...

Kajal Smoking Cigarette:  సిగరెట్ తో దమ్ము మీద దమ్ము అంటున్న  చంద్రమామ.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు రీజన్ ఏమిటంటే
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2021 | 3:54 PM

Kajal Smoking Cigarette: సమాజం మీద సెలబ్రెటీల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది.. ముఖ్యంగా సినీ, క్రీడాకారులను అభిమానించేవారు అనుకరించే వారు ఎక్కువగా ఉంటారు. అందుకనే ప్రముఖ కంపెనీలు వస్తువుల ప్రకటనలో కూడా ఎక్కువుగా సినీ సెలబ్రెటీలనే తీసుకుంటారు..తాజాగా ఓ సిని హీరోయిన్ సిగరెట్ ను పట్టుకుని దమ్ము మీద దమ్ము లాగుతున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరస్ అయ్యింది. ఆ చందమామ గురించి వివరాల్లోకి వెళ్తే..

తెలుగు సిని పరిశ్రమలో దశాబ్దం క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న చిన్నది కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషలో హీరోయిన్ గా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు జతకట్టింది.. బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్,రామ్ చరణ్,అల్లు అర్జున్ మెగా హీరోల సరసన నటించి రికార్డ్ సృష్టించింది. ఇక ఎన్టీఆర్, సూర్య, వంటి స్టార్ హీరోలతో నటించిన కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకుంది

. అయితే కాజల్ చేతిలో సిగరేట్‌ పట్టుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అమాయకంగా కనిపించే కాజల్ సిగరెట్ కాల్చడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి కాజల్‌ నిజంగా ధుమపానం చేసినప్పటికీ అది వెబ్‌ సిరీస్‌లో భాగంగానే అలా చేసిందని.. ‘లైవ్ టెలికాస్ట్‌’ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో కాజల్ కొన్ని మాస్‌ సీన్స్‌లో కాజల్‌ సిగరెట్‌ కాల్చే సందర్భాలు ఉండటంతో సిగరెట్ కాల్చిందని కొంతమంది అంటున్నారు. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించడానికి రెడీ అవుతోంది. ‘లైవ్ టెలికాస్ట్‌’ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లో కాజల్‌ నటిస్తోంది. దీంతో కాజల్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో జోడీగా ఆచార్య సినిమాలోనూ విష్ణు కు జోడీగా మోసగాళ్లులో నటిస్తోంది. ఇక తమిళ్‌లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించడానికి రెడీ అవుతోంది.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైవ్ టెలికాస్ట్‌’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది.

Also Read:

మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్

 రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బోనీకపూర్.. ఇద్దరి మధ్య గొడవ దేని గురించో తెలుసా..