Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shingarakonda Temple: శింగరకొండ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి తిరునాళ్లు

ప్రకాశం జిల్లా అద్దంకి( Addanki) లోని ప్రఖ్యాత శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి తిరునాళ్లకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు...

Shingarakonda Temple: శింగరకొండ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచి తిరునాళ్లు
Singarakonda
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 15, 2022 | 9:29 PM

ప్రకాశం జిల్లా అద్దంకి( Addanki) లోని ప్రఖ్యాత శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి తిరునాళ్లకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు(Devotees) భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు(Security) ఏర్పాటు చేసింది. దేవస్థాన గరుడ స్తంభంపై చెక్కిన 1443నాటి శిలా శాసనాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని దేవరాయలు అనే రాజు పరిపాలించాడని తెలుస్తోంది. శింగన్న అనే భక్తుని పేరు మీదుగా ఈ కొండకు శింగరకొండ అనే నామకరణం వచ్చిందని స్థానికులు, అర్చకులు చెబుతారు. 250 ఏళ్ల క్రితం కొండపైనున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుండగా కొండ మీద మహా యోగి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చి స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు. శింగరకొండ క్షేత్రంలో 67వ వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి 3 రోజులపాటు వైభవంగా జరగనున్నాయి.

ధ్వజస్తంభ దాత కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ధ్వజపతాక పూజ, ధ్వజారోహణ చేయడంతో తిరునాళ్లు ప్రారంభం అవుతాయి.రెండోరోజు రుద్రసహిత మన్యసూక్త ఏకాదశ వారాభిషేకం, స్వామి అలంకరణ ఉంటాయి. మూడో రోజు ఉదయం ఐదున్నర నుంచి స్వామి దివ్య దర్శనం ప్రారంభమవుతుంది. తిరునాళ్లకు పోలీస్ శాఖ 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. అశ్లీల కార్యక్రమాలకు తావు లేకుండా ప్రభల ఏర్పాటు కమిటీతో చర్చలు జరిపారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరారు.

Also Read

IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Telangana GO.111: జీవో 111 పరిధి భూములు ఇక బంగారమే.. జీవో ఎత్తివేస్తే ఎవరికి ప్రయోజనం?