Shiv Parwati Vivaah: భూతగణాలతో పార్వతిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన శివుడు.. ఆదిదంపతుల పెళ్లి కథ ఏమిటంటే

పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతి దేవి.. హిమవంతుడు. మైనవతి కుమార్తె. పార్వతి దేవి ఎల్లప్పుడూ శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే శివుడిని పొందడం అంత సులభం కాదు. ఇందు  కోసం తల్లి పార్వతి దేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది. పార్వతి తపస్సు వల్ల మూడు లోకాలలోనూ అలజడి రేగింది.. పెద్ద పర్వతాలు కూడా కంపించాయి.

Shiv Parwati Vivaah: భూతగణాలతో పార్వతిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన శివుడు.. ఆదిదంపతుల పెళ్లి కథ ఏమిటంటే
Shiva Parvati Marriage
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2024 | 8:26 PM

దేవ దేవుడైన శివుడు లయకారుడు. మూడు లోకాలలో గొప్ప తపస్విగా కూడా వర్ణించబడ్డాడు. శివుడు భర్తగా పొందాలని భావించిన పార్వతి కఠోర తపస్సు చేసి వివాహం చేసుకుంది. ఆది దంపతులుగా పూజలను అందుకుంటున్నారు. పార్వతి దేవి పరమశివుడిని భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. పూర్వ జన్మలో పార్వతి దేవి సతీదేవి అని చెబుతారు. పురాణాల్లో శివుడు , పార్వతి దేవి వివాహం గురించి ప్రస్తావన ఉంది. మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు. శివ-పార్వతి వివాహానికి సంబంధించిన ఒక విశిష్టమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పార్వతి దేవి కఠోర తపస్సు

పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతి దేవి.. హిమవంతుడు. మైనవతి కుమార్తె. పార్వతి దేవి ఎల్లప్పుడూ శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే శివుడిని పొందడం అంత సులభం కాదు. ఇందు  కోసం తల్లి పార్వతి దేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది. పార్వతి తపస్సు వల్ల మూడు లోకాలలోనూ అలజడి రేగింది.. పెద్ద పర్వతాలు కూడా కంపించాయి.

ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతి తల్లి తపస్సుకు సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ పార్వతి స్పష్టంగా నిరాకరించింది. తన మనసులో శివుడిని భర్తగా భావించానని.. అందుకే వేరొకరితో పెళ్లి చేసుకోవడం కుదరదని పార్వతి దేవి తెలిపింది. పార్వతికి తనపై ఉన్న ప్రేమను చూసి శివయ్య హృదయం ద్రవించింది. ఆ తర్వాత అతను పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

అద్వితీయమైన ఊరేగింపుతో కల్యాణానికి వచ్చిన శివయ్య

ఒక పౌరాణిక కథనం ప్రకారం శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు.. శివుడు తనతో పాటు భూత గణాలతో ఊరేగుతూ వచ్చాడు. ఈ వివాహనికి వచ్చిన అతిథులే శివుడిని అలంకరించారు. వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారికలైన భూతగానాలతో పెళ్లి ఊరేగింపుగా వచ్చాడు.  అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడ్డారు. ఆశ్చర్యపోయారు.

పెళ్లికి నిరాకరించిన రాణి మైనావతి

పార్వతి తల్లి మైనవతి శివుడిని చూసి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. అప్పుడు పార్వతి దేవి .. శివుడిని ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది. తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు. శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు, అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాణి మైనవతి కూడా వివాహానికి అంగీకరించింది. అనంతరం భూత గణాలు, దేవతలందరూ, విశ్వ సృష్టికర్త  బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు వివాహ అతిథులందరి సమక్షంలో శివపార్వతిల వివాహం పూర్తయింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు