AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi Temple: గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం.. మూడు రోజులకు ఏకంగా రూ. 6 కోట్లు..

ఈ నెల 20న ప్రారంభమైన గురు పౌర్ణమి ఉత్సవాలు షిర్డీ సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అయితే భక్తులు వివిధ రూపాయల్లో సాయి బాబాకు విరాళాలు అందించినట్లు షిర్డీ సాయిబాబాకు రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకురినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ గోరక్షా గాడిల్కర్ వెల్లడించారు. గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా సుమారు 2 లక్షల మంది వచ్చినట్లు చెప్పారు.

Shirdi Temple: గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం.. మూడు రోజులకు ఏకంగా రూ. 6 కోట్లు..
Shirdi Sai Baba
Surya Kala
|

Updated on: Jul 25, 2024 | 7:51 PM

Share

ప్రపంచంలో అత్యంత సంపన్న ఆలయం తిరుమల తిరుపతి క్షేత్రం. తర్వాత స్థానంలో మహారాష్ట్రలోని షిర్డీ క్షేత్రంగా నిలుస్తుంది. అయితే ఇప్పుడు శ్రీవారి ఆదాయానికి పోటీగా షిర్డీ నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆషాడ మాసంలోని పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ నెల 20న ప్రారంభమైన గురు పౌర్ణమి ఉత్సవాలు షిర్డీ సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అయితే భక్తులు వివిధ రూపాయల్లో సాయి బాబాకు విరాళాలు అందించినట్లు షిర్డీ సాయిబాబాకు రూ.6 కోట్లకుపైగా ఆదాయం సమకురినట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ గోరక్షా గాడిల్కర్ వెల్లడించారు. గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా సుమారు 2 లక్షల మంది వచ్చినట్లు చెప్పారు.

గురుపూర్ణిమ సందర్భంగా షిర్డీ సాయి బాబా ఆలయానికి నగదు రూపంలో రూ. 2 కోట్ల 50 లక్షలు రాగా.. డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ లో కోటికి పైగా విరాళం వచ్చినట్లు.. చెక్కులు, మనీ ఆర్డర్‌ల రూపంలో సుమారు రూ. 2 కోట్ల వచ్చినట్లు వెల్లడించారు. ఇక మరికొందరు భక్తులు బంగారం, వెండిని విరాళంగా ఇచ్చినట్లు.. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని వెల్లడించారు. సాయి బాబాను స్పెషల్ దర్శనం కోసం రూ. 200 టికెట్లు ఇచ్చినట్లు.. లడ్డుల కవర్లు అమ్మకం ద్వార రూ.62 లక్షలకు పైగా వచ్చినట్లు వెల్లడించారు. సాయి ప్రసాదాలయంలో లక్ష 90 వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు.

గురు పున్నమి వేడుకలు జరిగిన మూడు రోజులు షిర్డీ పట్టణం భక్తుల రద్దీతో నిండిపోయింది. జులై 21న జపాన్‌కు చెందిన 18 మంది భక్తులు బాబాను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. గత 10 ఏళ్లుగా గురు పౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయిని దర్శించుకుంటున్నారు. షిర్డీని సందర్శించే భక్తులకు మరింత ఆనందాన్ని ఇచ్చే విధంగా థీమ్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. షిరిడి నగరంలో 22 ఎకరాల్లో ఈ ప్రాజెక్టను రూపొందనుంది. ఇందులో బాబా జీవితాన్ని తెలియజేసే విధంగా లేజర్ షోని ఏర్పాటు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో