AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: పారిస్ అథ్లెట్స్ విలేజ్‌లో వివిధ రకాల భారతీయ వంటకాలతో సహా ఫుడ్ మెనూ తెలుసా..!

పారిస్ గేమ్స్ నిర్వాహకులు క్రీడాకారుల కోరికలను తీర్చడానికి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్ల పోషకాహారాన్ని విస్తృత శ్రేణి ఆహార మెనులో చేర్చారు. పోటీలను వీలైనంత ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంతో ప్యారిస్ నిర్వాహకులు మెను నుంచి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్‌లో ఒకటైన చికెన్ నగ్గెట్స్‌ను నిషేధించారు. అయితే భారతీయు క్రీడాకారులు చింతించకండి..

Paris Olympics 2024: పారిస్ అథ్లెట్స్ విలేజ్‌లో వివిధ రకాల భారతీయ వంటకాలతో సహా ఫుడ్ మెనూ తెలుసా..!
Paris Olympics 2024 Menu
Surya Kala
|

Updated on: Jul 25, 2024 | 6:41 PM

Share

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ అథ్లెట్లు ఇంటికి దూరం అయ్యామనే ఫీలింగ్ లేకుండా ఫుడ్ మెనూ తయారు చేయబడింది. అథ్లెట్లు తమకు నచ్చింది తినాలి. త్రాగాలి. తమ శరీరానికి ఏది ప్రయోజనకరంగా ఉంటుందో అదే తినాలి. కఠినమైన ఆహార నియమావళి అథ్లెట్లకు హానికరం. ఎందుకంటే మనసు ఆహారం తినాలని కోరుకుంటే సంతోషంగా ఉండడానికి నచ్చిన ఆహారం తినాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిస్ గేమ్స్ నిర్వాహకులు క్రీడాకారుల కోరికలను తీర్చడానికి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్ల పోషకాహారాన్ని విస్తృత శ్రేణి ఆహార మెనులో చేర్చారు. పోటీలను వీలైనంత ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంతో ప్యారిస్ నిర్వాహకులు మెను నుంచి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్‌లో ఒకటైన చికెన్ నగ్గెట్స్‌ను నిషేధించారు. అయితే భారతీయు క్రీడాకారులు చింతించకండి.. ఎందుకంటే చికెన్ నగ్గెట్స్ ప్యారిస్ ఒలింపిక్స్ మెనులో లేకపోయినా క్రీడాకారులు బటర్ చికెన్, బిర్యానీతో కూడిన రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఈ రెండు వంటకాలు భారత దేశంలో ప్రసిద్ధి చెందాయి.

పారిస్ ఒలింపిక్స్ కి చెందిన మెను గురించి భారత బృందం చీఫ్ న్యూట్రిషనిస్ట్.. ఆరాధనా శర్మ మాట్లాడుతూ భారత ఉపఖండంతో సహా వివిధ దేశాలకు చెందిన వంటకాలను సూచించే మెనూను నాలుగు భాగాలుగా విభజించనున్నట్లు తెలిపారు. అంతేకాదు అథ్లెట్స్ విలేజ్‌లో మెనూలో ఉండే కొన్ని భారతీయ వంటకాలను వెల్లడించారు. “వెజ్ బిర్యానీ, బటర్ చికెన్, కొంచెం కాలీఫ్లవర్ కర్రీ, పనీర్ డిష్ ఉన్నాయి. అయితే ఈ ఆహారం ప్రతిరోజూ అందించరు. అప్పుడప్పుడు భారతీయ అథ్లెట్లు ఈ ఆహారాన్ని రుచి చూడనున్నారు అని శర్మ అన్నారు.

పారిస్‌లో ఎవరు ఏమి ఆర్డర్ చేసుకోవచ్చంటే

ఇవి కూడా చదవండి

నలుగురు చెఫ్‌లు అథ్లెట్‌లకు ఆహారం ఇస్తారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని పొందడానికి నిర్దిష్ట అభ్యర్థనలు చేయవచ్చు. గ్రేట్ బ్రిటన్ గంజి, 50,000 టీ బ్యాగ్‌లను ఆర్డర్ చేయడంతో ఇప్పటికే ఆర్డర్‌లు రావడం ప్రారంభించాయి. కొరియన్లు కిమ్చీలను ఆర్డర్ చేశారని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..