AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోటీశ్వరుడి కావడానికి 21ఏళ్లుగా అన్నం మాత్రమే తింటున్న వ్యక్తి.. ఎక్కడంటే

జపాన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదించాలని.. వీలైనంత త్వరగా లక్షాధికారి కావాలని కోరుకున్నాడు. అందుకోసం తాను తినే ఆహారం, పానీయాల విషయంలో కూడా రాజీ పడ్డాడు. అయితే ఆ జపనీస్ వ్యక్తి పేరు వెల్లడించలేదు.. అతని వయస్సు దాదాపు 45 సంవత్సరాలని.. అతను ముందుగా ఉద్యోగ విరమణ చేయడానికి డబ్బును ఓ రేంజ్ లో ఆదా చేస్తున్నాడు.

Viral News: కోటీశ్వరుడి కావడానికి 21ఏళ్లుగా అన్నం మాత్రమే తింటున్న వ్యక్తి.. ఎక్కడంటే
Miserable JapanImage Credit source: unsplash
Surya Kala
|

Updated on: Jul 25, 2024 | 5:53 PM

Share

సాధారణంగా ప్రజలు డబ్బు సంపాదించి తద్వారా తమ జీవితం సుఖంగా సాగాలను కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డబ్బు సంపాదించాలనే తపనతోనే ఉంటారు. దీని కోసం వారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. వాస్తవానికి జపాన్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదించాలని.. వీలైనంత త్వరగా లక్షాధికారి కావాలని కోరుకున్నాడు. అందుకోసం తాను తినే ఆహారం, పానీయాల విషయంలో కూడా రాజీ పడ్డాడు.

అయితే ఆ జపనీస్ వ్యక్తి పేరు వెల్లడించలేదు.. అతని వయస్సు దాదాపు 45 సంవత్సరాలని.. అతను ముందుగా ఉద్యోగ విరమణ చేయడానికి డబ్బును ఓ రేంజ్ లో ఆదా చేస్తున్నాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆ వ్యక్తి 2000ల ప్రారంభంలో స్థిరమైన ఉద్యోగాన్ని ఎంతో కష్టం మీద సంపాదించుకున్నాడు. దీంతో అతను డబ్బులు ఎలాగైనా దాచాలని భావించాడు. అప్పుడు తన పొదుపు వ్యూహాన్ని ప్రారంభించాడు. అతను పని చేస్తున్న కంపెనీ తన ఉద్యోగులపై మరింత ఎక్కువ పని చేయాలని ఒత్తిడి తెచ్చింది. భవిష్యత్తులో సంతోషంగా ఉండాలంటే కష్టపడి పనిచేయడం, ఓవర్‌టైమ్‌ ద్వారానే సాధించవచ్చని కంపెనీ తెలిపింది.

20 ఏళ్లుగా కంపెనీ హాస్టల్‌లో ఉంటున్న ఉద్యోగి

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం ఆ వ్యక్తి వార్షిక జీతం దాదాపు 5 మిలియన్ యెన్లు అంటే దాదాపు రూ. 27 లక్షల 20 వేలు. అతను వీలైనంత త్వరగా 100 మిలియన్ యెన్‌లను ఆదా చేసి ముందస్తు రిటైర్‌మెంట్ తీసుకోవడానికి వ్యూహాన్ని రూపొందించాడు. అతను తన ఆహార పదార్థాలను తినే విషయంలో కూడా పొదుపు చేయడం ప్రారంభించాడు. అతను ఉచితంగా లభించే ఒక గిన్నె అన్నం, కొన్ని సాల్టెడ్ కూరగాయలు, ఎనర్జీ డ్రింక్ తాగేవాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను 20 సంవత్సరాలకు పైగా తన కంపెనీ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. ఈ సమయంలో అతను ప్రతి నెల 30 వేల యెన్‌లు అంటే సుమారు 16 వేల రూపాయలు అద్దెగా చెల్లించాడు. ఫర్నిచర్, సామగ్రి కోసం డబ్బును స్వయంగా సేకరించాడు.

7 కోట్లు ఆదా అయింది

కొన్నిసార్లు రాత్రి భోజనానికి బిస్కెట్లు మాత్రమే తిని కోలా తాగేవాడు. కొన్నిసార్లు ఎనర్జీ డ్రింక్ తాగి నిద్రపోయేవాడు. చాలా సార్లు వేసవి రోజులలో అతను తన సహోద్యోగి కారు విండ్‌స్క్రీన్‌పై ఏదో వండుకుని తినేవాడు. అదే కంపెనీలో 20 ఏళ్ల 10 నెలలు పనిచేసిన తర్వాత తాను 135 మిలియన్ యెన్లు అంటే రూ.7 కోట్లకు పైగా ఆదా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడని నివేదిక పేర్కొంది. ఈ వింత పొడుపు ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశమైంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..