AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosoon Eating Tips: వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏమిటి? ఎటువంటి ఆహారం తినాలంటే..?

వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం చాలా అవసరమని నారాయణ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. వర్షాకాలంలో తినే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి వాటిని చేర్చుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏమిటి? ఎటువంటి ఆహారం తినాలి అనే విషయం నిపుణుల చెబుతున్న విషయాలను గురించి తెలుసుకుందాం..

Mosoon  Eating Tips: వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏమిటి? ఎటువంటి ఆహారం తినాలంటే..?
Healthy Eating Tips
Surya Kala
|

Updated on: Jul 25, 2024 | 5:36 PM

Share

వర్షాకాలంలో వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ పెరిగుతుంది. నీరు కలుషితమవుతుంది. వాతావరణంలో మార్పులతో జీర్ణక్రియతో పాటు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో తినే ఆహారం, ఇతర జీవనశైలి అలవాట్ల పట్ల తగిన జగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. కనుక వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం చాలా అవసరమని నారాయణ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. వర్షాకాలంలో తినే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి వాటిని చేర్చుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏమిటి? ఎటువంటి ఆహారం తినాలి అనే విషయం నిపుణుల చెబుతున్న విషయాలను గురించి తెలుసుకుందాం..

సీజనల్ పండ్లు, కూరగాయలు

వర్షాకాలంలో జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి, సీజనల్ పండ్లు ,కూరగాయలను తినండి. ఆపిల్, పియర్, దానిమ్మ, రేగు వంటి పండ్లను తినండి. అంతేకాదు ఆహారంలో కాకర కాయ, పొట్లకాయ, బెండకాయలను తప్పకుండా చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి

సుగంధ ద్రవ్యాలు

వర్షాకాలంలో పసుపు, అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలు వంటి వాటిని చేర్చండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అందువల్ల, రుచితో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి వాటిని తినే ఆహారంలో చేర్చుకోండి.

పుష్కలంగా నీరు త్రాగాలి

వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే వీలైనంత వరకు హైడ్రేటెడ్‌గా ఉండండి. వేడి నీరు లేదా సాధారణ నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. నిర్జలీకరణాన్ని నివారించడానికి హెర్బల్ టీ లేదా నిమ్మకాయ నీరు త్రాగవచ్చు.

వేడి వేడి ఆహారాన్ని తినండి

జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి వర్షాకాలంలో తాజా, వేడి ఆహారాన్ని తినండి. పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. సూప్‌లు, కూరలు, హెర్బల్ టీలు ఈ సీజన్‌కు మంచి ఎంపికలు. అంతేకాదు పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోవాలి. యోనిలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే పచ్చి సలాడ్లు, ఉడికించని ఆహారాన్ని తినవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..