సూక్ష్మజీవుల దాడిలో నాశనమైన కణాలకు ప్రత్యేక ప్రోటీన్ సాయంతో ఇవి మరమ్మత్తులు చేస్తాయి. తద్వారా రోగ నిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయని నేచర్ రివ్యూస్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అధ్యయనం తెలిపింది. జ్వరం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జీవక్రియ రేటు పెరుగుతుంది. అంటే చెమట పట్టడం, మల్ల ,మూత్ర విసర్జన లాంటివి ఎక్కువ జరుగుతాయి. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపించడమే దాని అర్థం.