Navaratri 2023: శ్రీశైలంలో కన్నుల పండువగా శరన్నవరాత్రులు.. పుష్ప పల్లకిపై కాత్యాయని అలంకారంలో అమ్మవారు దర్శనం
శ్రీశైల మహక్షేత్రంలో దసరా మహోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామి అమ్మవారు హంస వాహనం పై కొలువు దీరగా.. దంపతులకు అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కన్నులపండువగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. భ్రమరాంబ అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. స్వామివారితో కలిసి వాహన సేవలను జరుపుకుంటూ కనుల విందు చేస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీశైలంలో పుష్ప పల్లకిపై కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన భ్రమరాంబ దేవి అమ్మవారు క్షేత్ర పుర వీధులలో పుష్ప పల్లకిపై శ్రీ స్వామితో కలిసి అమ్మవారు విహరించారు.
శ్రీశైల మహక్షేత్రంలో దసరా మహోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామి అమ్మవారు హంస వాహనం పై కొలువు దీరగా.. దంపతులకు అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో కాత్యాయని అలంకారంలోని అమ్మవారు శ్రీస్వామివారు గ్రామోత్సవానికి తరలి వెళ్లారు.
ఉత్సవం ముందు కోలాటాలు, డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారు గ్రామోత్సవంలో భక్తులను కటాక్షించారు. గంగాధర మండపం నుండి పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారు అంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకూ అమ్మవారు పుష్పపల్లకిలో గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు .శ్రీశైల క్షేత్రమంతా శివ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ పూజ కైకర్యాలు, పుష్పపల్లకి సేవలో ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..