AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2024: నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి.. దుర్గాదేవి అనుగ్రహం మీ సొంతం.. డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు

పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది. అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Navaratri 2024: నవరాత్రుల్లో ఈ వస్తువులను ఇంటికి తీసుకురండి.. దుర్గాదేవి అనుగ్రహం మీ సొంతం.. డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు
Durga Puja
Surya Kala
|

Updated on: Sep 26, 2024 | 8:18 PM

Share

హిందూ మతంలో దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. శారదీయ నవరాత్రులు ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నాడు ప్రారంభమవుతాయి. ఈ శరన్నవరాత్రులు 9 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పండుగ 9 రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గలుగా రోజుకో ఒక్క రూపంలో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులూ భక్తులు ఉపవాసం ఉండి, దేవాలయాలను సందర్శించి.. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

దుర్గా అష్టమి, నవమి రోజున కన్య పూజ నిర్వహిస్తారు. దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు అంటే దశమి తిథి రోజున దసరాగా జరుపుకుంటారు. పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది. అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

శరన్నవరాత్రులు 2024 ఎప్పుడంటే

వేద పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం యొక్క ప్రతిపద తిథి అక్టోబర్ 3 న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అక్టోబర్ 4 తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం, అక్టోబర్ 3, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

నవరాత్రులలో ఈ ప్రత్యేక వస్తువులను ఇంటికి తెచ్చుకోండి

లక్ష్మీ దేవి విగ్రహం లేదా చిత్రం

నవరాత్రి సమయంలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చొని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తీసుకుతెచ్చుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంటి పూజ గదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం.

వెండి నాణెం

నవరాత్రులలో ఇంటికి వెండి నాణెం తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణెం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నాణేన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం.

అలంకరణ వస్తువులు

నవరాత్రులలో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు, కుంకుమ, పసుపు, మెహందీ వంటివి తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు.

తామర పువ్వు

లక్ష్మిదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రులలో ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి.

తులసి మొక్క

నవరాత్రులలో ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా చాలా మంచిదని భావిస్తారు. నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నుడవుతారని నమ్ముతారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది.

నవగ్రహ యంత్రం

నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్టించడం వలన అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

స్వస్తిక్

స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే