Maharastra: మహారాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఒప్పందం .. రూ. 21 వేల కోట్లతో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం

మేఘా సంస్థ మహారాష్ట్ర లోని నందుర్బార్ జిల్లాలోని కామోడ్ వద్ద ఒక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఘోస్లా వద్ద రెండవ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మించనుంది. రూ 21 వేల కోట్లతో నిర్మించే ఈ జల విద్యుత్ కేంద్రాల ద్వారా నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని రెండున్నర వేల మందికి ఉపాధి లభిస్తుందని ఫడ్నవీస్ తెలిపారు.

Maharastra: మహారాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఒప్పందం .. రూ. 21 వేల కోట్లతో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం
Solar Power Plants
Follow us

|

Updated on: Sep 26, 2024 | 8:01 PM

మహారాష్ట్రలో 21 వేల కోట్ల పెట్టుబడితో నాలుగువేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కపూర్, మేఘా సంస్థ తరపున కంపెనీ ప్రెసిడెంట కిషోర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ నీటి వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. ఈ ప్రాజెక్ట్ తమ రాష్ట్రానికి బహుళ ఉపయోగకారిగా ఉంటుందన్నారు. ఎం ఈ ఐ ఎల్ బిల్డ్-ఓన్-మెయింటెనెన్స్ విధానంలో నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్టులు ఇవి. కామోడ్ వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని 5 సంవత్సరాలలో.. ఘోస్లా వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల ఐదు నెలల్లో మేఘా నిర్మించనుంది.

ఈ ఒప్పందంలో భాగంగా మేఘా సంస్థ మహారాష్ట్ర లోని నందుర్బార్ జిల్లాలోని కామోడ్ వద్ద ఒక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఘోస్లా వద్ద రెండవ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మించనుంది. రూ 21 వేల కోట్లతో నిర్మించే ఈ జల విద్యుత్ కేంద్రాల ద్వారా నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని రెండున్నర వేల మందికి ఉపాధి లభిస్తుందని ఫడ్నవీస్ తెలిపారు.

రోజుకు ఎంత విద్యుత్ నిల్వ చేస్తుందంటే

పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ ద్వారా అతి తక్కువ వ్యయంతో జల విద్యుత్ ని ఉత్పత్తి చేయనున్నారు. జల విద్యుత్ శక్తిని నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుఉంటుంది. ఈ విద్యుత్ శక్తి వలన సులభతరంగా గ్రిడ్ నిర్వహణ, ఫ్రీక్వెన్సీ నియంత్రణ చేయవచ్చు. ఈ రెండు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఆఫ్-స్ట్రీమ్ ప్రాజెక్టులు..రోజుకు కనీసం 6 గంటల విద్యుత్ శక్తి నిల్వ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలా పనిచేస్తుందంటే

ఒక్కో ప్రాజెక్ట్ లో ప్రధానంగా రెండు రిజర్వాయర్లు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, వాటర్ కండక్టర్ సిస్టం నిర్మిస్తారు. ఇందులో అత్యాధునిక రివర్సిబుల్ టర్బైన్లు, నీటిని ఎత్తిపోసే మెషీన్ల ను వాడి జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఎగువన ఒక రిజర్వాయర్, దిగువన ఒక రిజర్వాయర్ని నిర్మించి మధ్యలో జల విద్యుత్ శక్తి ప్లాంట్ ని నిర్మిస్తారు. నీటిని దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ రిజర్వాయర్ కి ఎత్తిపోసేందుకు అత్యాధునిక మెషీన్లను ఉపయోగిస్తారు. ఈ మూడు వ్యవస్థలు ఒకదానికినొకటి అనుసంధానమై ఉంటాయి. ఈ ప్రతిపాదిత రిజర్వాయర్లలో నీటిని దగ్గరలో ఉన్న నీటి వనరుల నుంచి నింపుతారు.

ఈ ప్రాజెక్ట్ విశేషం ఏమిటంటే

విద్యుత్ ఉత్పత్తి అధిక డిమాండ్ సమయంలో రివర్సిబుల్ టర్బైన్లు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతాయి. అవే టర్బైన్లు తక్కువ డిమాండ్ ఉన్న సమయంలో నీటిని ఎత్తిపోసే పంపులుగా పనిచేస్తాయి.

ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్టులు మహారాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయని చెప్పారు. అంతేకాదు దేశవ్యాప్తంగా విద్యుత్ ని గ్రిడ్ ద్వారా సరఫరా చేసి దేశ పురోగాభివృద్ధిలో భాగం అయినందుకు గర్వపడుతున్నాం అని తెలిపారు. ఒప్పంద కార్యక్రమంలో గిరీష్ , రవి కిరణ్, సమీర్ ఝాలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..