లడ్డులో కల్తీ.. ప్రాయశ్చిత్తంగా తిరుమలకు పయనమైన మాధవీలత..రైలులో గోవిందుడి భజనలు చేస్తున్న భక్త బృందం.
లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి శ్రీవారిని తలచుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటారు. అంత పవిత్రంగా భావించి స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ అనే సంచలన ఆరోపణలతో యావత్ హిందు సమాజం ఉల్కి పడింది. ప్రస్తుతం రాజకీయ రంగుని పులుముకుంది. రాజకీయ నేతలు, ప్రముఖులు ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణ బిజేపీ మహిళా నేత మాధవీలత స్పందించారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు పయనం అయ్యారు.
భారత దేశం ఒక ఇల్లు అయితే.. ఆ ఇంట్లో పూజ గది తిరుపతి అన్నంతగా భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రం గురించి భావిస్తారు. కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను ఇల వైకుంఠం అని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తరించాలని భావించే భక్తులు ఎందరో ఉన్నారు. పిలిస్తే పలికే దైవంగా .. భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలను అందుకుంటున్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం భక్తులు ఎంత భక్తీ శ్రద్దలతో నిర్వహిస్తారో.. అంతే భక్తీ శ్రద్దలతో స్వామివారి ప్రసాదం లడ్డుని భావిస్తారు. తిరుమల క్షేత్రం ఎవరినా వెళ్తున్నారు అంటే.. వారు తెచ్చే లడ్డు ప్రసాదం కోసం తెలిసిన వారుసైతం ఇష్టంగా ఎదురు చూస్తారు. స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి కూడా నియమ నిష్టలను ఆచరిస్తారు. స్నానం చేసి కాళ్ళకు చెప్పులు తీసేసి లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి శ్రీవారిని తలచుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటారు. అంత పవిత్రంగా భావించి స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ అనే సంచలన ఆరోపణలతో యావత్ హిందు సమాజం ఉల్కి పడింది. ప్రస్తుతం రాజకీయ రంగుని పులుముకుంది. రాజకీయ నేతలు, ప్రముఖులు ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ విషయంపై తెలంగాణ బిజేపీ మహిళా నేత మాధవీలత స్పందించారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు పయనం అయ్యారు. వందే భారత్ రైలులో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్నారు. ఈ మాధవీ లత చేపట్టిన ఈ ప్రాయశ్చిత్త యాత్రలో భాగంగా సహచర భక్త బృందంతో కలిసి రైలులో భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
గోవిందుడు నామం జపిస్తూ శ్రీనివాసుడు పాటలు ఆలపిస్తూ.. భక్త బృందంతో కలిసి భజన చేస్తూ వందేభారత్ ట్రైన్ లో మాధవీలత తిరుమలకు బయలుదేరారు. నడక మార్గంలో తిరుమలకు చేరుకుని రేపు స్వామివారిని దర్శించుకోనున్నారని తెలుస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..