Ravana Brahma: రాక్షస రాజు రావణుడు వశం, సుగుణాలు ఏమిటో తెలుసా..
పర స్త్రీ మోహం ఉన్న రావణుడిని రాముడు సంహరించినందుకు గుర్తుగా దసరా సంబరాలను రావణ దహనం వంటి కార్యక్రమాలను జరుపుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతుంది. అయితే రావణుడిలోని దుర్గుణాల గురించి ఎక్కువగా అందరూ చెబుతారు. కానీ రావణాసురుడు జ్ఞాన సంపద గురించి చాలా మందికి తెలియదు.. రావణాబ్రహ్మ గురించి ఈ రోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం..
హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే దసరా పండగ వస్తుందంటే చాలు హిందువుల ఇంట్లో సందడి మొదలవుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో దుర్గాదేవిని శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలను అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు. నవరాత్రులు తొమ్మది రూపాలను పుజిస్తారు. చివరి రోజు అంటే 10వ రోజుగా దసరగా భావించి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ. ఈ రోజున అసురుడైన రావణాసురుడిని రాముడు సంహరించాడని పురాణాల కథనం. ఈ విజయానికి గుర్తుగా దసరా సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకుంటారు.
హిందూ పురాణాలలో లంకకు పది తలల రాక్షస రాజు రావణాసురుడు. రావణుడు రామాయణంలో చాలా ముఖ్యమైన, ప్రధాన పాత్రలలో ఒకటి. నవ వ్యాకరణ పండితుడైన రావణాసురుడు పది తలలు, ఇరవై చేతులతో కోరుకున్న రూపాన్ని ధరించే వరం ఉన్నవాడు. సీతను అపహరించిన రావణాసురుడు రాక్షసుడు. పర స్త్రీ మోహం ఉన్న రావణుడిని రాముడు సంహరించినందుకు గుర్తుగా దసరా సంబరాలను రావణ దహనం వంటి కార్యక్రమాలను జరుపుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతుంది. అయితే రావణుడిలోని దుర్గుణాల గురించి ఎక్కువగా అందరూ చెబుతారు. కానీ రావణాసురుడు జ్ఞాన సంపద గురించి చాలా మందికి తెలియదు.. రావణాబ్రహ్మ గురించి ఈ రోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం..
రావణుడు సగం బ్రాహ్మణుడు..సగం రాక్షసుడు. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వశ్రవుడు. తల్లి కైకసి. దైత్య రాకుమారి. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. దశగ్రీవ అంటే పది తలలు” అని అర్ధం. విశ్వశ్రవుడికి ఇద్దరు భార్యలు.. వరవర్ణిని, కైకసి. సంపదకు అధిపతి అయిన కుబేరుడు విశ్వశ్రవుడి మొదటి భార్య వరవర్ణినికి జన్మించాడు. రెండో భార్య కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు జన్మించారు.
రావణుడు, అతని సోదరుడు కుంభకర్ణుడు.. తపస్సు చేసి బ్రహ్మ దేవుడు నుండి అద్భుతవరాలను, అనేక శక్తులను పొందారు. లంకను జయించి కుబేరుడిని లంక నుంచి తరిమికొట్టారు.
రావణుని పేరు దశగ్రీవుడు లేదా దశనన్ (పది తలల రాక్షసుడు).
శివుడు ధ్యానంలో చేస్తున్న కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నించినప్పుడు.. శివుడు తన కాలి వేళ్ళతో పర్వతాన్ని అణిచిపెట్టాడు. అప్పుడు రావణుడు బాధతో కేకలు వేశాడు. శివుడిని తన సామ వేద మంత్రాలతో పూజించి శివుడి అనుగ్రహం సొంతం చేసుకున్నాడు. అప్పుడు శివుడు దశగ్రీవ ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేసావు అందుకే నిన్ను రావణ అని పిలుస్తున్నా అంటాడు శివుడు. అలా రావణాసురుడు అనే పేరు వచ్చింది. రావణుడు అంటే గర్జించేవాడు లేదా అరవటం’ అని అర్థం.
శివుని యొక్క గొప్ప భక్తులలో ఒకడు రావణుడు. శివ తాండవ స్తోత్రాన్ని రచించారు. రావణుడి భక్తికి సంతోషించిన శివుడు అతనికి చంద్రహాస అనే అజేయ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు.
రావణుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన అనరణ్యుడు వధించాడు. అప్పుడు మరణశయ్యపై ఉన్న అనరణ్యుడు రావణుని సంహారం తమ వంశంలోని దశరథ కుమారుడు చేతిలో జరుగుతుందని శపించాడు.
రావణుడు వానరుల రాజు వాలిని చంపడానికి ప్రయత్నించాడు. సముద్రపు ఒడ్డున సూర్య భగవానుని ప్రార్థిస్తూ ఉండేవాడు. వాలి ఎంతో బలవంతుడై రావణుడిని తన చేతుల్లోకి తీసుకుని కిష్కింధకు తీసుకెళ్లాడు. వాలి చేతిలో రావణుడు ఓడిపోయిన తరువాత.. ఇద్దరూ స్నేహితులుగా మారారు. వాలి తన తమ్ముడు సుగ్రీవునితో యుద్ధం చేస్తూ రాముడి చేతిలో సంహరింపబడ్డాడు.
రావణుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు. వేదాలు, జ్యోతిషశాస్త్ర నిపుణుడు కూడా. రావణుడి భార్య మండోదరి .. కుమారుడు మేఘనాథుడి జన్మనిస్తున్న సమయంలో రావణుడు తన కుమారుడు అమరుడయ్యేలా ‘లగ్నానికి’ అన్ని గ్రహాలు, సూర్యుడు తమ స్థానాల్లో ఉండాలని ఆదేశించాడు. అయితే శనీశ్వరుడు స్థానం ఆకస్మికంగా మార్చుకోవడం వలన రావణుడి కోపానికి గురై తన గదతో శనీశ్వరుడుపై దాడి చేసి అతని ఒక కాలు విరగొట్టాడు.
రావణుడు గొప్ప అభ్యాసకుడు. రాముడు రావణుడిని సంహరించిన అనంతరం రాముడు .. తన తన సోదరుడు లక్ష్మణుడి మరణ శయ్య మీద ఉన్న రావణుడి వద్దకు వెళ్లి మర్త్యుడైన రాక్షస రాజు నుంచి రాజనీతిజ్ఞతను, దౌత్యాన్ని నేర్చుకోమని ఆదేశించాడు.
వెయ్యి సంవత్సరాల తపస్సు తరువాత రావణుడు బ్రహ్మదేవుని నుంచి అమరత్వాన్ని వరంగా కోరుకున్నాడు. అయితే రావణాసురుడు నాభిలో అమృతభాండం ఉంది. రామ, రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో 10 వ రోజు రావణుడి సోదరుడు విభీషణుడు అసుర రాజును చంపడానికి రావణాసురుడు నాభి దగ్గర బాణం వేసి సంహరించమని రాముడికి చెప్పాడు.
బ్రహ్మ దేవుడు నుంచి రావణుడు చావులేని వరం అంటే మానవుడు తప్ప.. అసురుడు, కిన్నరుడు లేదా గంధర్వుడు తనను చంపలేరనే వరం పొందాడు. మానవుడైన రాముడు చేతిలో రావణుడు మరణం పొందాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి