AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masa Shivaratri: కోరుకున్న వరుడిని పొందడం కోసం మాస శివరాత్రి రోజున ఇలా పూజ చేయండి.. శుభ సమయం ఎప్పుడంటే

మాస శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక రకాల యాదృచ్చికలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా పూజా సమయం పరిమితంగా ఉంది. గ్రహాల స్థానాలు, ప్రత్యేక తిధి కలయిక వల్ల ఈ యాదృచ్చికం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో చేసే పూజకు అపారమైన ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఈసారి మాస శివరాత్రి శుభ సందర్భంగా కేవలం 48 నిమిషాల సమయం మాత్రమే పూజకు అందుబాటులో ఉంటుంది

Masa Shivaratri: కోరుకున్న వరుడిని పొందడం కోసం మాస శివరాత్రి రోజున ఇలా పూజ చేయండి.. శుభ సమయం ఎప్పుడంటే
Masa Shivaratri 2024
Surya Kala
|

Updated on: Sep 26, 2024 | 4:03 PM

Share

హిందూ మతంలో ప్రతి నెల కృష్ణ పక్షంలోని చతుర్దశి తిధిన మాస శివరాత్రి పండుగగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, ఇంట్లో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. అవివాహిత బాలికలు మాస శివరాత్రి రోజున మహాదేవుని సమేతంగా పార్వతీదేవిని పూజించి కోరుకున్న వరుడితో వివాహం జరగాలని కోరుకుంటూ పూజిస్తారు. మాస శివరాత్రి పరమశివుడు, పార్వతిదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు చేసే పూజలతో శివుడు భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడని నమ్మకం.

మాస శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక రకాల యాదృచ్చికలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా పూజా సమయం పరిమితంగా ఉంది. గ్రహాల స్థానాలు, ప్రత్యేక తిధి కలయిక వల్ల ఈ యాదృచ్చికం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో చేసే పూజకు అపారమైన ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఈసారి మాస శివరాత్రి శుభ సందర్భంగా కేవలం 48 నిమిషాల సమయం మాత్రమే పూజకు అందుబాటులో ఉంటుంది.

పంచాంగం ప్రకారం భాద్రప్రద మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 30న రాత్రి 07:06 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 01వ తేదీ రాత్రి 09:39 గంటలకు ముగుస్తుంది. శివ శక్తి నిషా కాలంలో మాస శివరాత్రి రోజున పూజిస్తారు. మాస శివరాత్రి సెప్టెంబర్ 30 న జరుపుకుంటారు. మాస శివరాత్రి పూజా సమయం రాత్రి 11:47 నుంచి 12:35 వరకు ఉంటుంది. అంటే కేవలం 48 నిమిషాల సమయం మాత్రమే పూజకు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మాస శివరాత్రి పూజ విధి

  1. మాస శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
  2. ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించండి.
  3. గంగాజలం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయండి.
  4. శివలింగంపై బిల్వ పత్రాలను సమర్పించి ధూపం, దీపం వెలిగించండి.
  5. పూజ సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి.
  6. శివునికి హారతి నిర్వహించి పండ్లు, పుష్పాలను సమర్పించండి.
  7. పూజ సమయంలో మాస శివరాత్రి కథను తప్పకుండా వినండి.
  8. పూజ ముగింపులో పేదలకు, ఆపన్నులకు దానం చేయండి.

మాస శివరాత్రి రోజున ఈ మంత్రాలను జపించండి

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ్ బన్ధనన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్

శుభ యాదృచ్చిక ప్రాముఖ్యత

మాస శివరాత్రి రోజున పవిత్రమైన యాదృచ్ఛికం ఏర్పడనుంది. పరమశివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి ఒక సువర్ణావకాశం. ఈ ప్రత్యేక సమయంలో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఎందుకంటే ఈ కలయికలో చేసే పూజ గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ సందర్భంగా ఆరాధించడం ద్వారా, ప్రజలు మోక్షాన్ని పొందుతారు. జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది