Ravana Temples: మన దేశంలో ఈ ప్రాంతాల్లో రాముడిని కాదు రావణుడిని పుజిస్తారు..

దసరా అంటే చెడుపై మంచి సాధించడానికి గుర్తుగా జరుపుకునే రోజు.. రావణాసురుడిని సంహరించి విజయాన్ని సాధించిన శ్రీరాముడిని ఈ రోజు గుర్తు చేసుకుంటారు. నవరాత్రుల తర్వాత రోజు అంటే 10 వ రోజు విజయదసమి గా రావణాసురుడు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఈ రావణ దహనాన్ని దేశం అంతటా ఓ పండగలా చేసుకుంటారు. సీతా దేవిని అపహరించిన రావణుడు రక్షస రాజు. రామాయణంలో ఓ విలన్. అయితే రావణుడు గొప్ప శివ భక్తుడు కూడా.. మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా హీరో. ఇక్కడ లంకాపతి రావణుడికి రోజూ పూజలను చేస్తారు. దేశంలో ఈ ఆరు ప్రదేశాల్లో రాముడిని కాదు రాక్షస రాజైన రావణుడిని పూజిస్తారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Sep 26, 2024 | 5:14 PM

దసరా రోజున శ్రీరాముడు పది తలల రావణుడిని సంహరించినట్లు ప్రతీతి. అందుకే నవరాత్రులలో 10వ రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసి రావణుని సంహరించిన చిహ్నంగా ఆ  విజయాన్ని భారతదేశమంతటా పండుగలా జరుపుకుంటారు.

1 / 7
రామాయణంలో ఓ విలన్. అయితే రావణుడు గొప్ప శివ భక్తుడు కూడా.. మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా హీరో. ఇక్కడ లంకాపతి రావణుడికి రోజూ పూజలను చేస్తారు. దేశంలో ఈ ఆరు ప్రదేశాల్లో రాముడిని కాదు రాక్షస రాజైన రావణుడిని పూజిస్తారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

2 / 7
మందసౌర్, మధ్యప్రదేశ్: హిందూ గ్రంధాల ప్రకారం రావణుడి భార్య మండోదేవి మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో జన్మించింది. కనుక ఇక్కడి ప్రజలు రావణుడిని మందసౌరుని అల్లుడిగా పూజిస్తారు. దసరా పర్వదినాన స్థానికులు రావణుని ఇంట్లో దీపాలు ఆర్పి గౌరవిస్తారు.

3 / 7

బిస్రఖ్, ఉత్తరప్రదేశ్: హిందువుల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని బిస్రఖ్ ప్రాంతం రావణుని జన్మస్థలం. కనుక ఇక్కడి ప్రజలు రావణుడిని మహాబ్రహ్మగా పూజిస్తారు. నవరాత్రులలో 10వ రోజు స్థానికులు రావణుడికి పూజలు చేస్తూ యజ్ఞం చేస్తారు.

4 / 7
కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్: ఈ ప్రదేశంలో శివుడిని శాంతింపజేయడానికి రావణుడు భక్తితో తపస్సు చేశాడని నమ్ముతారు. రావణుడి తపస్సుకు ముగ్ధుడై శివుడి అనుగ్రహం పొందాడు. కనుక కాంగ్రా స్థానికులు రాబెనసర్ లో దిష్టిబొమ్మలను దహనం చేయరు.

5 / 7
జోధ్‌పూర్, రాజస్థాన్: జోధ్‌పూర్‌లోని ఈ ఆలయంలో రావణుడిని దేవతగా పూజిస్తారు. పురాణాల ప్రకారం రావణుడు మండోదరి అని పిలువబడే మండవర్ రాజు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రాష్ట్రం మీదుగా సరస్వతీ నది ప్రవహించేది. ఆ రాజు రాజ్యం సరస్వతీ నది ఒడ్డున ఉండేది. జోధ్‌పూర్‌లోని అనేక ప్రదేశాలలో తన అల్లుడైన రావణుడి మరణానికి సంతాపాన్ని ఆ రాజు వారసులు వ్యక్తం చేస్తారు. నేటికీ ఈ ప్రాంతంలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.

6 / 7
కోలార్, కర్ణాటక: రావణుడు శివ భక్తుడు. కనుక కోలార్ జిల్లాలోని ఈ ఆలయంలో రావణుడికి అరుదైన గౌరవం లభిస్తుంది. ఈ ఆలయంలో రావణుడిని పూజిస్తారు. దసరా పండుగ సందర్భంగా స్థానికులు ఊరేగింపు నిర్వహిస్తారు. అంతేకాదు స్థానికులు 10 తలలు, 20 ఆయుధాలు ఉన్న రావణుడితో పాటు శివునిని కూడా పూజిస్తారు.

7 / 7
Follow us