తిరుమల చుట్టూ రాజకీయం.. అసలు డిక్లరేషన్‌పై TTD రూల్ ఏం చెబుతోంది?

తిరుమలకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పుడు కొండంత వివాదం నెలకొంటున్నాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వివాదం చల్లారక ముందే ఇప్పుడు డిక్లరేషన్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అసలు తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ వ్యవహారం ఏంటి...? అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా...?

తిరుమల చుట్టూ రాజకీయం.. అసలు డిక్లరేషన్‌పై TTD రూల్ ఏం చెబుతోంది?
Tirumala Declaration Row
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 27, 2024 | 2:01 PM

తిరుమల ఆలయంలో కల్తీ నెయ్యి వివాదం కంటిన్యూ అవుతుండగానే డిక్లరేషన్ వ్యవహారం మరో రచ్చకు దారితీసింది. మాజీ సిఎం జగన్ తిరుమలకు రానుండటంతో డిక్లరేషన్ రాద్ధాంతానికి తెర తీసింది. తిరుమల వెంకన్నపై నమ్మకం విశ్వాసం ఉంటేనే రావాలని అధికార పక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలన్న టీటీడీ నిబంధనను వైఎస్ జగన్ గౌరవించాలని అటు స్వామీజీలు, హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. డిక్లరేషన్ ఇవ్వలేదంటే జగన్‌ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తోంది. దీంతో మరోసారి తిరుమల కొండపై డిక్లరేషన్ వ్యవహారం కొండంత చర్చకు దారి తీస్తోంది.

తిరుమలకు సంబంధించిన కీలక అంశాలపై ఇప్పుడు కొండంత వివాదం నెలకొంటున్నాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ వివాదం చల్లారక ముందే ఇప్పుడు డిక్లరేషన్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అసలు తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ వ్యవహారం ఏంటి…? అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా…? ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య భక్తుల మధ్య కూడా హాట్ టాపిక్ అయ్యింది.

Jagan Tirumala Visit

Jagan Tirumala Visit

ఆంగ్లేయుల కాలం నుంచే డిక్లరేషన్..

తిరుమల వెంకన్న దర్శనం కోసం కొండకు వచ్చే హిందూయేతరులు వైకుంఠం వద్ద డిక్లరేషన్ సమర్పించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ఆంగ్లేయుల పాలన కాలంలోనే ఈ నిబంధన అమల్లో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పడగా ఈ మేరకు ప్రత్యేక చట్టం చేసి డిక్లరేషన్ రూల్ అమలు చేశారు. అప్పట్లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో తిరుమల ఆలయ పాలన కోసం సలహా మండళ్ళు ఏర్పాటు జరిగినట్లు స్పష్టమవుతుంది. ఆ తర్వాత 1969 లో ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ లోని సెక్షన్లు 85 నుండి 91 ప్రకారం టీటీడీ పాలనలో పలు నిబంధనలు అమలులోకి వచ్చాయి. 1987 లో ఏపీ చారిటబుల్ & హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఎండోమెంట్స్ చట్టాన్ని సవరణ చేయడంతో అనేక మార్పులు వచ్చాయి.

ఇక 2006లో చేసిన సవరణలతో బోర్డు, అర్చకులు, వంశపారపర్యంగా వాటా పొందే హక్కు 1987 తీసుకొచ్చిన చట్టం రద్దు చేసింది. ఆ తరువాత టీటీడీలో ఎన్నో పాలన మార్పులు రాగా అన్యమతస్తులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా ఇవ్వాలన్న నిబంధన సంప్రదాయంగా వచ్చింది. 2006లో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారమ్‌లో సంతకం చేయడం తప్పనిసరి చేసింది. వెంకటేశ్వర స్వామి పై విశ్వాసం నమ్మకం ఉందని రాతపూర్వకంగా సదరు డిక్లరేషన్‌లో పేర్కొనాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ లో జీఓ ఎంఎస్ నెంబర్ 311 (1990) ప్రకారం ఆదేశాలు కూడా అమల్లోకి వచ్చాయి.

డిక్లరేషన్ రూల్‌ను సీరియస్‌గా అమలు చేయని టీటీడీ

టీటీడీ చట్టంలో కూడా రూల్ నెంబర్ 136 గా ఈ అంశాన్ని పొందుపర్చడంతో డిక్లరేషన్ ఇచ్చి ఇప్పటికే ఆలయంలో ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 వ నెంబర్ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. డిక్లరేషన్ కు సంబంధించిన పత్రాలను కూడా టీటీడీ అక్కడ అందిస్తుంది. ఇతర మతస్తులు సంతకం చేసి శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. ఇలా గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారు. అయితే ప్రముఖులు కాకుండా సాధారణ భక్తులుగా హిందూయేతరులు వెంకన్న దర్శనానికి వస్తే వారి వివరాలు సేకరించే యంత్రాంగం టీటీడీలో లేదు. ప్రత్యేక దర్శనాలకు వచ్చే వీవీఐపీల వివరాలు మాత్రమే తెలిసే అవకాశం ఉండగా డిక్లరేషన్ వ్యవహారంలో టిటిడి తీసుకుంటున్న చర్యలు సీరియస్ గా కనిపించడం లేదు.

శ్రీవారి దర్శనానికి వెళ్లే హిందూయేతరులు స్వామివారి పట్ల నమ్మకం విశ్వాసం ఉందని డిక్లరేషన్ విధిగా ఇవ్వాలన్న నిబంధన కూడా టిటిడి పాటించడం లేదు. దీంతో ప్రముఖులు, విదేశీయులు మినహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే హిందూయేతరులు డిక్లరేషన్ నిబంధనను ఉల్లంఘిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్‌ డిక్లరేషన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే చాలాసార్లు తిరుమలకు వచ్చిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోగా ఇప్పుడు జగన్ విషయంలో మరోసారి చర్చగా మారింది.

2012 మార్చి నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ వచ్చి విషయం అప్పట్లో వివాదానికి కారణం కాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా జగన్ డిక్లరేషన్ ఇష్యూ నడుస్తూనే ఉంది. 2014లో కూడా జగన్ తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. 2017లో ఆ తరువాత సీఎం హోదాలో పలుసార్లు తిరుమలకు వచ్చిన జగన్ డిక్లరేషన్ సమర్పించ లేదన్న విమర్శలు ఇప్పుడు తెరమీదికి తెస్తోంది అధికారపక్షం. 2012 తర్వాత అప్పటి గవర్నర్ నరసింహన్ ఆదేశాలతో డిక్లరేషన్ వ్యవహారంలో సీరియస్ గా ఉండాలని నిర్ణయించినా అమలు చేయడంలో టీటీడీ మీనమేషాలే లెక్కించింది. హిందూయేతరులు ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి నిబంధనను అమలు చేసేలా పర్యవేక్షణకు టీటీడీలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడం ప్రధాన లోపంగా మారిపోయింది.

Tirumala Temple

Tirumala Temple

జగన్‌ను భక్తులు అడ్డుకుంటారని జనసేన వార్నింగ్..

ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి తిరుమలకు చేరుకోనున్న జగన్.. రేపు(శనివారం) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనుండటంపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. కూటమి నేతలతో పాటు స్వామీజీలు, హిందూ సంఘాలు జగన్ డిక్లరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. జగన్ తిరుమలకు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్న కూటమి నేతలు. తిరుమలకు వస్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇస్తున్నట్టు ముందుగా ప్రకటించాకే రావాలని జనసేన డిమాండ్ చేస్తింది. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు, శ్రీవారి భక్తులు స్వామీజీలు అడ్డుకుంటారని హెచ్చరిస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో తిరుమల అపవిత్రమైందని, అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్ ఎప్పుడూ తిరుమలకు ఒంటరిగానే వస్తున్నారని ఆరోపిస్తోంది. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్న జనసేన నేతలు జగన్ తిరుమల పర్యటన ఒక డ్రామా అని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు.

మరోవైపు టీటీడీ పరిపాలన భవనంలో ఈవోను కలిసిన బిజెపి ప్రతినిధులు మాజీ సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ తీసుకోవాలని కోరారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అలిపిరి గరుడ సర్కిల్ లో అడ్డుకుంటామని ఈఓ‌‌కు బిజెపి నేతలు తెలిపారు. టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గేట్ ముందు విజిలెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు బిజేపీ నేతలు.

ఇక శ్రీవారిమట్టు మార్గం నుంచి తిరుమల చేరిన తెలంగాణ బిజేపీ నేత మాధవిలత జగన్ పర్యటనను అడ్డుకోవాలంటున్నారు. జగన్ వాహనాలు తిరుమలకు రాకుండా హిందువులు అడ్డంగా రోడ్డుపై పడుకోవాలని మాధవీ లత పిలుపునిచ్చారు. లడ్డూ వివాదం నేపథ్యంలో ఆమె వందే భారత్ ట్రైన్‌లో తన సన్నిహితులతో కలిసి భజన చేస్తూ హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్నారు.

Madhavi Lata

Madhavi Lata

ఇక స్వామీజీలది ఇదే వాదన..

అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నిరసన చేపట్టిన స్వామీజీలు గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సేవ్ తిరుమల గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేసిన స్వామీజీలు, హిందూ సంఘాలు.. డిక్లరేషన్ ఇచ్చినా జగన్ తిరుమల కొండకు వెళ్లేందుకు వీలు లేదంటున్నారు. జగన్‌ను అడ్డుకుంటామంటామని కొందరు స్వామీజీలు వార్నింగ్ ఇస్తున్నారు.

రాజకీయం కోసమే డిక్లరేషన్ రాద్ధాంతం: వైసీపీ

అటు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెళ్తారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టంచేశారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు లేని డిక్లరేషన్ వివాదం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు డిక్లరేషన్ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు వైయస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న జగన్ ను డిక్లరేషన్ అడిగేవారు… అడ్డుకునేవారు హిందువుల ద్రోహి అంటూ ఫైరయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల వెళుతుంటే రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తోందని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. మూడు అధికార పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా వ్యవహరించడం హాస్యాస్పదం అన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో లేవన్నారు. జగన్ మోహన్ రెడ్డి దైవ దర్శనానికి వెళ్తుంటే.. తిరుపతిలోని స్థానిక పార్టీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు.

ఇలా ఒకవైపు నెయ్యి వివాదం మరోవైపు జగన్ డిక్లరేషన్ వివాదంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి జిల్లా లో పోలీస్ యాక్ట్ 30 విధించింది. శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా అక్టోబర్ 25 వరకు పోలీసు 30 యాక్ట్ అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. నిరసనలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

అసలు డిక్లరేషన్‌పై టీటీడీ రూల్ ఏం చెబుతోంది?
అసలు డిక్లరేషన్‌పై టీటీడీ రూల్ ఏం చెబుతోంది?
పొడి దగ్గును తగ్గించే ఎఫెక్టీవ్‌ చిట్కాలు.. బెస్ట్‌గా పనిచేస్తాయి
పొడి దగ్గును తగ్గించే ఎఫెక్టీవ్‌ చిట్కాలు.. బెస్ట్‌గా పనిచేస్తాయి
దాల్ మసాలా వడలను ఇలా చేయండి.. క్రిస్పీగా టేస్ట్ అదుర్స్!
దాల్ మసాలా వడలను ఇలా చేయండి.. క్రిస్పీగా టేస్ట్ అదుర్స్!
భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంతంటే?
భారీగా పెరిగిన టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ.. విజేతకు ఎంతంటే?
తెలంగాణ పూల జాతర వచ్చేసింది..! ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే..
తెలంగాణ పూల జాతర వచ్చేసింది..! ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే..
రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఈజీగా సన్నబడతారు..! ట్రై చేయండి
రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఈజీగా సన్నబడతారు..! ట్రై చేయండి
తగ్గేదిలే.. ఇక అంబానీతో పాటు ఆ జాబితాలో పిల్లలు కూడా..
తగ్గేదిలే.. ఇక అంబానీతో పాటు ఆ జాబితాలో పిల్లలు కూడా..
బుమ్రా ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తాడా.. టీజ్ చేసిన కోహ్లీ, జడేజా
బుమ్రా ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తాడా.. టీజ్ చేసిన కోహ్లీ, జడేజా
చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!
చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!
అనామిక మాస్టర్ ప్లాన్.. రుద్రాణి సంతోషం, రాజ్, కావ్యల పంచాయితీ
అనామిక మాస్టర్ ప్లాన్.. రుద్రాణి సంతోషం, రాజ్, కావ్యల పంచాయితీ