Sawan Purnima 2022: నేడు శ్రావణ పౌర్ణమి.. పుణ్య ప్రాప్తికి, కోరిన కోర్కెలు తీరడానికి నేడు పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..

శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు యజ్ఞోపవీతం త్యజించి కొత్త యజ్ఞోపవీతాన్ని పూజించి ధరిస్తారు. అటువంటి పవిత్ర పౌర్ణమి తిథి నాడు పుణ్య ప్రాప్తికి, కోరిన కోర్కెలు తీరడానికి ఎన్నో నియమాలు చెప్పబడ్డాయి.

Sawan Purnima 2022: నేడు శ్రావణ పౌర్ణమి.. పుణ్య ప్రాప్తికి, కోరిన కోర్కెలు తీరడానికి నేడు పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..
Sawan Purnima 2022
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2022 | 6:35 AM

Sawan Purnima 2022: సనాతన సంప్రదాయంలో శ్రావణ పౌర్ణమి తిథికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది సోదర సోదరీమణుల అనురాగాలతో ముడిపడి ఉన్న రాఖి పండుగకు మాత్రమే కాదు..  ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. శివుడు, విష్ణువు, లక్ష్మీ దేవి లకు ప్రీతిపాత్రమైనది. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు యజ్ఞోపవీతం త్యజించి కొత్త యజ్ఞోపవీతాన్ని పూజించి ధరిస్తారు. అటువంటి పవిత్ర పౌర్ణమి తిథి నాడు పుణ్య ప్రాప్తికి, కోరిన కోర్కెలు తీర్చుకోవడానికి ఎన్నో నియమాలు చెప్పబడ్డాయి. శ్రావణ పౌర్ణమి రోజున మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.

శ్రావణ పూర్ణిమ రోజున ఏమి చేయాలంటే  ఈరోజు శ్రావణ మాసం పూర్ణమి తిథి.. ఈ రోజు శివారాధన, పూజలు, రుద్రాభిషేకం, మంత్రాలను పఠించడం వంటివి చేయండి. శ్రీ హరి ఆరాధనకు ప్రతి నెల పౌర్ణమి తిథి చాలా ఉత్తమంగా పరిగణించబడుతుంది. కనుక ఈ రోజు విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు పండ్లు, పసుపు మిఠాయిలను సమర్పించి పూజించాలి. ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. పూర్ణిమ తిథి రోజున విష్ణువుతో పాటు సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  ఈ రోజు ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ,యు సంపద పొందడానికి, లక్ష్మీ దేవిని పూజించండి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో కొబ్బరికాయను సమర్పించండి. ఈరోజు రాఖీ పండుగ రోజు కనుక మీ సోదరుడికి రాఖీ కట్టడంతో పాటు, మీ అధిష్టాన దేవతకు ఖచ్చితంగా రాఖీ కట్టండి. నేడు, సోదరీమణులు రాఖీ కట్టడంతో పాటు పూజారికి రక్షాసూత్రాన్ని కట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు శ్రావణ పూర్ణిమ నాడు మీ సోదరీమణులకు కానుకగా ఇవ్వండి. పూర్ణిమ పవిత్ర తేదీ చంద్రుని ఆరాధనకు కూడా ప్రసిద్ధి చెందింది. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండి మానసికంగా ఇబ్బంది పడుతుంటే..  ఈరోజు చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి మంత్రాన్ని జపించండి.

శ్రావణ పూర్ణిమ నాడు ఏమి చేయకూడదంటే: ఈరోజు, శ్రావణ పూర్ణిమ రోజున మీ సోదరీమణులతో ఏ విధంగానూ వాదించకండి లేదా వారికి బాధ కలిగించవద్దు. శ్రావణ మాసం పౌర్ణమి నాడు ఉల్లి, వెల్లుల్లి వంటివి తినవద్దు. శ్రావణ మాసం పౌర్ణమి నాడు నల్లని వస్త్రాలు ధరించడం వద్దు శ్రావణ మాసం పౌర్ణమి నాడు ఎవరైనా దానం అడగడానికి వస్తే, అతనిని ఖాళీ చేతులతో పంపించవద్దు. శ్రావణ మాసం పౌర్ణమి నాడు పూజలు, ఉపవాస సమయంలో ఎదుటివారి పట్ల చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!