Omkareshwar Temple: ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో కొత్త నియమాలు.. 60 రోజుల పాటు అమలు..
శ్రావణ మాసం రెండు నెలల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు ఓంకారేశ్వర్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ అనూప్ సింగ్ ఓంకారేశ్వర్‌కు చేరుకుని ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండు జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌లో ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉత్తర భారత దేశంలో శ్రావణ మాసం మొదలైంది. ఈ నేపథ్యంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం కొత్త నిబంధనలు అమలు చేశారు. ఓంకారేశ్వర్ ఆలయం, రాజ్ మహల్ , ఓంకార పర్వతాలపై కూడా ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు చేశారు.
ఈ ఏడాది జంట శ్రావణ మాసాలు వచ్చాయి. దీంతో 60 రోజుల పాటు శ్రావణ మాసాన్ని భక్తులు జరుపుకుంటారు. జూలై 4 నుండి ప్రారంభమైన శ్రావణ మాసంలో రెండు నెలల్లో ఎనిమిది సోమవారాలు వస్తాయి. ఈసారి ఎనిమిది సోమవారాల్లో ఓంకారేశ్వర ఆలయంలో శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అంతేకాదు మహా శివుడు తన భక్తుల స్థితిగతులను తెలుసుకునేందుకు పల్లకిపై ఊరేగుతూ నగరం చుట్టూ తిరుగుతారు.
సెప్టెంబర్ 11న ఓంకార పర్వతానికి ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు ఓంకారేశ్వర్‌లో ఉండి శివుడిని పూజిస్తారు. ఇప్పటికే శివయ్య భక్తులు ధర్మశాలలోని ఆశ్రమాల్లో కూడా తమ క్యాంపును ఏర్పాటు చేసుకున్నారు.
ఓంకారేశ్వరుడిని దర్శించుకునేకుందుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు శ్రావణ మాసం రెండు నెలల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు ఓంకారేశ్వర్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ అనూప్ సింగ్ ఓంకారేశ్వర్‌కు చేరుకుని ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
దర్శనం కోసం కొత్త నిబంధనలను అమలు శ్రావణ మాసంలో భక్తులకు సక్రమంగా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను రూపొందించి అమలు చేసింది. శ్రావణ మాసం దృష్ట్యా ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రావణ రెండు నెలల పాటు దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ను రద్దు చేసినట్లు ఆలయాధికారులు చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో వీఐపీ దర్శనం రద్దు చేశారు.
ఆలయంలో ఉదయం 9 గంటల వరకు పూలు, బిల్వపత్రం, అభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం అభిషేకం, బిల్వపత్రం, పూలు సమర్పించడం నిషేధం. ఆలయ ప్రాంగణంలోకి అనధికారిక ప్రవేశించే అర్చకుల ప్రవేశంపై నిషేధం ఉంటుంది. అభిషేకం కోసం ఒక స్థలం కేటాయించినట్లు.. అక్కడే భక్తులు అభిషేకం చేయించుకోవాలని సూచించారు.
భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం.. వీఐపీ దర్శనం పేరుతో భక్తులతో జరుగుతున్న దోపిడి, అసభ్యతలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పది మందికి పైగా పాల్గొంటారు. ఆలయ ఏర్పాట్లపై కన్నేసి ఉంచుతారు. ఖాండ్వా-ఇండోర్ రోడ్డు మీదుగా ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌లకు భారీ సంఖ్యలో కవాడ్ యాత్రికులు చేరుకుంటారు. శివయ్యకు పవిత్ర నర్మదా నది నీటిని సమర్పించనున్నారు. కవాడ్ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇండోర్, ఖాండ్వా జిల్లా యంత్రాంగం కలిసి ఈ యాత్ర జరిగే సమయంలో ఇండోర్-ఇచ్ఛాపూర్ జాతీయ రహదారి మీదుగా భారీ వాహనాల రాకపోకలను పరిమితం చేయనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..