Telugu News Spiritual The world famous Markandeshwar Mahadev Temple in Ujjain know its popularity
Markandeshwar Temple: భక్త రక్షణ కోసం యముడిని బంధించిన శివయ్య.. దీర్ఘాయువు, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆలయంగా ప్రసిద్ధి
హిందువుల పవిత్ర క్షేత్రం ఉజ్జయినిలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకాళేశ్వర ఆలయం. ఈ ఆలయంలో స్వామివారిని పూజిస్తే అకాల మరణ భయం తొలగుతుంది విశ్వాసం. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు మహాకాళేశ్వర స్వామిని సందర్శించడానికి ఉజ్జయినికి వస్తారు. అయితే ఈ శివయ్య పుణ్యక్షేత్రంలో మరొక అద్భుతమైన ఆలయం ఉంది. ఇక్కడ తన భక్తుడిని రక్షించడానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. యమ ధర్మ రాజుని గొలుసులతో బంధించాడు. కనుక ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజను చేసి దీర్ఘాయువు, ఆరోగ్యాన్ని కోరుకుంటారు.