Annavaram Temple: ఘనంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణోత్సవం.. భక్తులతో నిండిన రత్నగిరులు
కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 6వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా తొలిరోజు సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లను పండితులు పెండ్లికొడుకు, పెండ్లికూతురుగా అలంకరించి ప్రత్యేకపూజలు జరిపారు.
అన్నవరం సత్యన్నారాయణ స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవారిని పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమంతో ఉత్సవాలు జరిగాయి. ఆ దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 6వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా తొలిరోజు సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లను పండితులు పెండ్లికొడుకు, పెండ్లికూతురుగా అలంకరించి ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం ముత్తైదువులు పసుపు దంచారు. సోమవారంరాత్రి 9గంటలకు కల్యాణవేదికపై స్వామివారి దివ్య కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కల్యాణానికి వచ్చే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నుంచి అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు.
సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవముల్లో భాగంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు ఇంద్రకీలాద్రి నుంచి పట్టు వస్త్రములు సమర్పించారు. అన్నవరం ఆలయ ఈవో చంద్ర శేఖర్ ఆజాద్… దుర్గగుడి నుంచి వచ్చిన అధికారులు, పాలకమండలికి సాదర స్వాగతం పలికారు. సత్యనారాయణ స్వామి, అనంత లక్ష్మి సత్యవతి దేవి అమ్మవారి దర్శనం కల్పించి… వేద ఆశీర్వచనము చేయించారు. స్వామివారి కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సారి భక్తులంతా స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా విస్తృత ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే భక్తులకు కల్యాణం స్పష్టంగా కనిపించేందుకు టీవీ, స్క్రీన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. పెళ్లి కుమారుడు, కుమార్తెలుగా దర్శనమిచ్చిన దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..