TTD Darshan: శ్రీవారి దర్శన టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. 15 నిమిషాల్లోనే సర్వదర్శన టోకెన్లన్నీ…
TTD Darshan: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తాజాగా టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్ల బుకింగ్ తీరును చూస్తే అర్థమవుతోంది. తాజాగా సోమవారం..
TTD Darshan: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తాజాగా టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్ల బుకింగ్ తీరును చూస్తే అర్థమవుతోంది. తాజాగా సోమవారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. టికెట్లు ఇలా ఓపెన్ చేశారో లేదో వెంటనే ఖాళీ అయ్యాయి. రోజుకు 10 వేల చొప్పున, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చిన టికెట్లన్నీ కేవలం 15 నిమిషాల్లోనే బుక్ కావడం గమనార్హం.
ఉదయం 9 గంటలకు భక్తులు వెబ్‌సైట్ ఓపెన్ చేయగా 10 నిమిషాలు వర్చువల్ క్యూలో వేచి ఉండాలంటూ స్క్రీన్ పై కనిపించింది. తీరా కేవలం పది నిమిషాల్లో చూసేసరికి వారాంతాలతో పాటు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక టికెట్లన్నీ బుక్ అయ్యాయి. ఇక మళ్లీ తేదీలు మార్చుకొని బుక్ చేద్దామనుకునేలోపే వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో లేవనే సందేశం దర్శనమిచ్చింది. దీంతో టికెట్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కొందరు భక్తులు నిరాశకు గురయ్యారు.
రేపటి నుంచి శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు..
ఇదిలా ఉంటే టీటీడీ అధికారులు రేపటి (డిసెంబర్ 28) నుంచి శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. జనవరి, ఫిబ్రవరి కోటాను రేపు మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500).. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) అందుబాటులో ఉంచనున్నారు. ఇక జనవరి 14నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ.500) విడుదల చేయనున్నారు.
వీటితో పాటు జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్ దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500).. శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల(రూ.500)ను రేపు తితిదే అందుబాటులో ఉంచనుంది.
Also Read: అభిమానం పీక్ స్టేజ్‌కి చేరింది.. ముఖానికి 30 సార్లు సర్జరీ చేయించింది..
Tirupati: పులుసు పెట్టే ఆశ కూడా లేదు.. ఆకు కూర కట్ట 40 రూపాయలు
Tirupati: పులుసు పెట్టే ఆశ కూడా లేదు.. ఆకు కూర కట్ట 40 రూపాయలు