Sankranti 2023: సంక్రాంతి రోజున దానానికి విశిష్ట స్థానం.. ఆ రోజున దానం చేయాల్సిన వస్తువులు ఏమిటో తెలుసా..
ధనుర్మాసం రోజుల్లో చాలా మంది నిరుపేదలకు ఉపయోగకరమైన వస్తువులను దానం చేస్తారు. మకర సంక్రాంతి రోజున ఈ వస్తువులను దానం చేయడం వలన సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి. ఈరోజు దానం చేయాల్సిన వస్తువుల వివరాలను గురించి తెలుసుకుందాం..
మకర సంక్రాంతి ప్రముఖ హిందూ పండుగ. ప్రత్యక్ష దైవం సూర్యుడిని ఆరాధిస్తారు. సంక్రాంతి పండగను ఇది ప్రతి సంవత్సరం జనవరి 14 న జరుపుకుంటారు. హిందూ సంస్కృతిలో మకర సంక్రాంతి పవిత్రమైన రోజు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో దానం చేయడానికి విశిష్ట స్థానం ఉంది. ధనుర్మాసం రోజుల్లో చాలా మంది నిరుపేదలకు ఉపయోగకరమైన వస్తువులను దానం చేస్తారు. మకర సంక్రాంతి రోజున ఈ వస్తువులను దానం చేయడం వలన సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి. ఈరోజు దానం చేయాల్సిన వస్తువుల వివరాలను గురించి తెలుసుకుందాం..
నువ్వులు: కొన్ని గ్రంధాల ప్రకారం మకర సంక్రాంతిని నువ్వుల సంక్రాంతి అని కూడా అంటారు. ఈ రోజు నువ్వులను దానం చేయడం శ్రేయస్కరం మాత్రమే కాదు, విష్ణువు, సూర్యుడు, శనీశ్వరుడిని కూడా మకర సంక్రాంతి నాడు నువ్వులతో పూజిస్తారు
బెల్లం: బెల్లం దానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. నువ్వులు, బెల్లం లడ్డూను డబ్బులతో కలిపి దానం చేయవచ్చు, దీనిని గుప్త లక్ష్మి దానం అంటారు.
పండ్లు, అన్న దానం: అన్ని దానాలలో అత్యంత పవిత్రమైన దానాలలో పండ్లు ఒకటి. పండ్లు పోషకాలు కలిగి ఉన్నాయి.. ఆరోగ్యాన్ని మెరుగుపరస్తాయి. అన్నదానానికి మించిన దానం లేదు. మకర సంక్రాంతి రోజున పండ్లను దానం చేయడం శుభ సందర్భంలో చేయవలసిన ఉత్తమమైన దానాల్లో ఒకటి
ఖిచిడీ దానం: మకర సంక్రాంతి రోజున ఖిచిడీ దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మకర సంక్రాంతి రోజున చాలా మంది బియ్యం, కంది పప్పును దానం చేస్తారు.
గాలిపటాలు మకర సంక్రాంతి పండగ రోజున గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజు పిల్లలకు రంగురంగుల గాలిపటాలు పంచడం వల్ల చిన్నారుల్లో ఆనందం, ఆనందం వెల్లివిరుస్తాయి.
మకర సంక్రాంతి నాడు నిరుపేదలకు ఉపయోగపడే వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. పండగ సమయంలో మీరు చేసే ఒక మంచి పని మీ పాపాలన్నింటినీ కడిగివేస్తుంది అనే ఆలోచనతో దానం చేయడం వలన సత్ఫలితాలను ఇవ్వదు.. ఏమీ ఆశించకుండా మంచి మనసుతో పండగ రోజున చేసే దానానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)