AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi Sai Baba Temple: రికార్డు స్థాయిలో షిర్డీ సాయిబాబా హుండీ ఆదాయం.. 2022లో ఆదాయం ఎంతంటే?

2022 లో కోవిడ్ మహమ్మారి తరువాత..  లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం షిరిడీ సాయిబాబాని దర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. డిసెంబర్ మూడో వారం నుంచి రోజుకు లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు.

Shirdi Sai Baba Temple: రికార్డు స్థాయిలో షిర్డీ సాయిబాబా హుండీ ఆదాయం.. 2022లో ఆదాయం ఎంతంటే?
Sai Baba Temple
Surya Kala
|

Updated on: Jan 07, 2023 | 11:20 AM

Share

షిర్డీ క్షేత్రంలో వెలసిన దైవం సాయిబాబా. తాము పిలిస్తే పలికే దైవం అని భక్తుల నమ్మకం. తనని దర్శనం చేసుకునే భక్తుల కోర్కెలను తీరుస్తాడని విశ్వాసం. తాము కోరిన కోర్కెలు నెరవేరినప్పుడు..  భక్తులు హృదయపూర్వకంగా ఆలయానికి వచ్చి సాయిబాబా ను దర్శించుకుంటారు. తమ స్థాయికి తగినట్లు కానుకల రూపంలో హుండీలో డబ్బులను, నగదు, బంగారం వంటివారిని బాబాకు భక్తి పూర్వకంగా సమర్పిస్తారు. 2022లో కూడా షిర్డీ సాయిబాబాకు కానుకలు వెల్లువెత్తాయి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిర్డీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. భక్తులు బంగారం-వెండి, చెక్కు, ఆన్‌లైన్ చెల్లింపు యాప్, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 400 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు.

గత సంవత్సరం షిర్డీ సాయిబాబా దేవాలయం.. హుండీ ఆదాయం లెక్కింపుని జరిపింది. భక్తులు ఇచ్చిన కానుకలను లెక్కించడానికి  గంటల సమయం పట్టింది, అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. 2022 లో కోవిడ్ మహమ్మారి తరువాత..  లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం షిరిడీ సాయిబాబాని దర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. డిసెంబర్ మూడో వారం నుంచి రోజుకు లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. డిసెంబర్ 31న కూడా ఆలయం రాత్రంతా తెరిచి ఉంచబడింది. నూతన సంవత్సరాన్ని బాబాని సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకొని మరింత ఉత్సాహంతో ప్రారంభించారు భక్తులు.

విరాళం మొత్తం ఎంత అంటే..  సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తాత్కాలిక CEO రాహుల్ జాదవ్.. మాట్లాడుతూ..  “దేవాలయ ప్రాంగణంలో ఉన్న హుండీల ద్వారా.. 166 కోట్ల రూపాయలకు పైగా విరాళంగా లభించింది” అని తెలిపారు. ‘డెబిట్/క్రెడిట్ కార్డులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, చెక్కులు, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా ట్రస్టుకు భక్తులు 144 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

బంగారం,వెండి కానుకలు..  ఆలయ ప్రాంగణంలోని ట్రస్టు క్యాష్ కౌంటర్‌లో భక్తులు 74 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.  2022 సంవత్సరంలో, సాయిబాబాకు 26 కిలోల కంటే ఎక్కువ బంగారం వచ్చింది. దీని ఖరీదు 12 కోట్లకు పైగా ఉంటుందని.. అదే విధంగా 330 కోట్లకు పైగా వెండిని బాబాకు కానుకగా ఇచ్చారు.. దీని విలువ దాదాపు 1.5 కోట్లు ఉంటుందని రాహుల్ జాదవ్ చెప్పారు.

ఈ భారీ మొత్తంలోని విరాళాలను సాయి సంస్థాన్.. సామాజిక సేవను చేయడానికి వినియోగిస్తామని రాహుల్ జాదవ్ చెప్పారు. తాము ప్రజలకు మరింత సేవను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ట్రస్టు రెండు ఆసుపత్రులను నడుపుతోందని చెప్పారు. ఇక్కడ ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడంతోపాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు సాయి సంస్థాన్ ప్రసాదాలయాన్ని కూడా నడుపుతోంది. ఇక్కడ ప్రతిరోజూ లక్ష మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం అందజేస్తున్నారు. అంతే కాకుండా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. దీంతో పాటు సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని సమీపంలోని రోడ్ల పనులకు కూడా డబ్బులను అందిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..