Palmistry: అరచేతిలో ఈ గుర్తులుంటే అదృష్టవంతులే.. జీవితమంతా సంపద, పేరు, కీర్తి వీరి సొంతం

హస్తసాముద్రికం ప్రకారం..  జీవిత రేఖ, విధి రేఖ, వివాహ రేఖ, చైల్డ్ లైన్ , డబ్బు సంబంధిత రేఖలు ఒక వ్యక్తి  అరచేతిపై దర్శనమిస్తాయి. ఇవే కాదు.. అనేక రకాల గుర్తులు కూడా కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రేఖలు చేతిలో ఉన్న వారి జీవితంలో.. భౌతిక సుఖాలు, ఐశ్వర్యం నిండి ఉంటుంది.

Palmistry: అరచేతిలో ఈ గుర్తులుంటే అదృష్టవంతులే..  జీవితమంతా సంపద, పేరు, కీర్తి వీరి సొంతం
Palmistry
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2023 | 10:58 AM

జ్యోతిష్య శాస్త్రంలో..  ఒక వ్యక్తి విధి, స్వభావం, భవిష్యత్తు గురించి అతని జన్మ రాశిని అధ్యయనం చేయడం  అతని భవిష్యత్ తెలుస్తుంది. వ్యక్తి జాతకం అరచేతిలోని గుర్తులు, రేఖలను అధ్యయనం చేయడం ద్వారా కూడా అతని భవిష్యత్తు గురించి చాలా విషయాలు చెబుతారు. హస్తసాముద్రికం ప్రకారం..  జీవిత రేఖ, విధి రేఖ, వివాహ రేఖ, చైల్డ్ లైన్ , డబ్బు సంబంధిత రేఖలు ఒక వ్యక్తి  అరచేతిపై దర్శనమిస్తాయి. ఇవే కాదు.. అనేక రకాల గుర్తులు కూడా కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రేఖలు చేతిలో ఉన్న వారి జీవితంలో.. భౌతిక సుఖాలు, ఐశ్వర్యం నిండి ఉంటుంది. జీవితాంతం ఆనందానికి, శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు. మరి మీ చేతుల్లో ఈ ప్రత్యేక గీతలు లేదా చిహ్నాలు ఉన్నాయో లేదో ఇప్పుడు చుద్దాం.

అరచేతిలో శశ యోగం 

అరచేతిలో అనేక రేఖలు కలిసినప్పుడు శుభ సంకేతాలు  ఏర్పడతాయి. మణికట్టు దగ్గర ఒక వ్యక్తి అరచేతిపై చేప ఆకారంలో ఉన్న గుర్తు ఉండి.. అది అక్కడ నుండి ఒక రేఖ నేరుగా శని శిఖరాన్ని తాకుతున్న ఆ వ్యక్తి చేతిలో శశ  యోగం ఏర్పడుతుంది. శని శిఖరం అరచేతిపై పూర్తిగా అభివృద్ధి చెందాలి. మణిబంధం నుండి శని శిఖరానికి వచ్చే రేఖ చాలా స్పష్టంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

అరచేతిలో శశ యోగం  ఉన్నవారిపై శనిదేవుడు విశేషమైన ప్రభావాన్ని చూపుతాడు. అలాంటి వారు మంచి స్థానానికి చేరుకుంటారు. వీరి జీవితంలో భౌతిక సుఖాలకు కొరత లేదు. అలాంటి వారు రాజకీయ రంగంలో కూడా బాగా రాణిస్తారు.

ఎవరి అరచేతిలో ఈ శశ యోగం ఏర్పడుతుందో.. వారు వారి జీవితంలో విజయవంతమైన వ్యాపారవేత్తలు కూడా. అలాంటి వ్యక్తులు వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తారు. అతనికి సమాజంలో మంచి పేరు లభిస్తుంది. శనీశ్వరుడి ప్రత్యేక ఆశీస్సులు అతనిపై  ఉంటాయి.

మరోవైపు, అరచేతిపై H గుర్తు ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు. బుధుడు, శుక్రుడు శిఖరాల మధ్య ఈ H గుర్తు ఏర్పడినట్లయితే. వారు సినిమా రంగంలోనూ, మీడియా రంగంలోనూ మంచి పేరు, డబ్బు సంపాదించడంలో వ్యక్తి సక్సెస్ అయ్యాడు. వీరు చాలా కళాత్మకంగా ఉంటారు.

ఎవరి అరచేతిలోనైనా స్వస్తిక, కలశం, సూర్యుడు, చేప, తామరపువ్వుల గుర్తులు ఉంటే.. ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. తన జీవితమంతా సుఖ సంతోషాలతో గడుపుతాడు. .

హస్తసాముద్రిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి అరచేతిలో సూర్యుని శిఖరం ఎత్తులో ఉన్నట్లయితే, ఆ వ్యక్తి సమాజంలో భిన్నమైన గుర్తింపును సంపాదించడంలో విజయం సాధిస్తాడు. అలాంటి వారికి సమాజంలో మంచి గౌరవం, సంపద, పలుకుబడి లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే