Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. రూ 300 ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల ఆరోజే.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జనవరి, ఫిబ్రవరిలో మాసాల్లో తిరుమల ఏడుకొండల వారిని దర్శించుకోవాలనుకునే వారికి టీటీడీ శుభవార్త చెప్పింది. ఆయా నెలల్లో ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం కీలక ప్రకటన చేసింది.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జనవరి, ఫిబ్రవరిలో మాసాల్లో తిరుమల ఏడుకొండల వారిని దర్శించుకోవాలనుకునే వారికి టీటీడీ శుభవార్త చెప్పింది. ఆయా నెలల్లో ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం కీలక ప్రకటన చేసింది. జనవరి 12 నుంచి 31వ తేదీ అలాగే ఫిబ్రవరి నెలలో శ్రీవారి దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను టికెట్లను విడుదల చేయనుంది. జనవరి 9న ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్లడించింది. ఆయా తేదీల్లో శ్రీవారి దర్శించుకోవాలనుకునేవారు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ అధికారిక వెబ్‌సైట్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ హెచ్చరించింది. కాగా జనవరి 2 నుంచి 11 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. దీంతో ఈనెల 12 నుంచి 31 వరకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను 9న విడుదల చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల దర్శనం టికెట్లు విడుదల..
కాగా నేటి (జనవరి 7) ఉదయం 9 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ. ప్రత్యేక కోటా కింద ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. టికెట్ బుక్ చేసుకునే వారి వయసు 65 ఏళ్లు నిండి ఉండాలి. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా పరిగణలోకి తీసుకుంటారు. సీనియర్ సిటిజన్ వెంట ఒక వ్యక్తికి అనుమతి (ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే, నిలబడకపోతే) ఉంటుంది. ఇక 80 ఏళ్లు దాటిన వారి సహాయకులకు కూడా అనుమతి ఇస్తారు.
— Tirumala Tirupathi updates (@ttd_updates) January 6, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..