Jallikattu: జల్లికట్టుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రేపటి నుంచి జరగనున్న పోటీలు.. చెన్నైలో నిర్వహణకు అనుమతి కోరుతున్న కమల్ హాసన్

వాస్తవానికి ప్రతియేటా జనవరి మొదటి రోజు నుంచే పుడుక్కోటై నుంచి జల్లికట్టు సందడి మొదలవుతుంది. అయితే జల్లి కట్టు నిర్వహణకు అధికారుల నుంచి అనుమతులు నిరాకరణ కారణంగా ఇప్పటి వరకూ జల్లికట్టు పోటీలు మొదలు కాలేదు.

Jallikattu: జల్లికట్టుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రేపటి నుంచి జరగనున్న పోటీలు.. చెన్నైలో నిర్వహణకు అనుమతి కోరుతున్న కమల్ హాసన్
Jallikattu
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 12:10 PM

సంక్రాంతి పండగ అంటేనే సంస్కృతి, సంప్రాదయాలు. సరదాలు సంబరాలు..  దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయాయ్యి. తాజాగా తమిళనాడుకు చెందిన సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు స్టాలిన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్లి కట్టు అంటేనే ఎద్దులను మచ్చిక చేసుకోవడం.. ఇందుకు ఏ ఆయుధాన్ని ఉపయోగిచకుండా తమ నేర్పుతో ఎద్దులను లొంగదీసుకుంటారు. అయితే ఈ సాంప్రదాయ జల్లి కట్టుని తమిళనాడుతో పాటు.. ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కనుమ పండుగ నాడు నిర్వహిస్తారు. వాస్తవానికి ప్రతియేటా జనవరి మొదటి రోజు నుంచే పుడుక్కోటై నుంచి జల్లికట్టు సందడి మొదలవుతుంది. అయితే జల్లి కట్టు నిర్వహణకు అధికారుల నుంచి అనుమతులు నిరాకరణ కారణంగా ఇప్పటి వరకూ జల్లికట్టు పోటీలు మొదలు కాలేదు. సుప్రీంకోర్టు లో తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా జల్లికట్టు పోటీల నిర్వహణపై ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది.

జల్లికట్టు కోసం రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకలతో జల్లికట్టు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి జరగనున్న జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. పోటీలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు కొన్ని సూచనలు చేశారు. తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సినేషన్, నెగటివ్ సర్టిఫికేట్ లు ఉండాలని పేర్కొంది. అంతేకాదు వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేసింది ప్రభుత్వం మూడు వందలకు మించకుండా ఆంక్షలు విధించింది. జల్లి కట్టు పోటీల నిర్వహణకు తప్పనిసరిగా కలెక్టర అనుమతి ఉండాలని పేర్కొంది.

తమిళనాడులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే జల్లికట్టు పోటీలకు ప్రాధాన్యత ఉంది. జనవరి 15 న అవన్యాపురం, 16 న పాలమేడు, 17 న అలంగా నల్లూరులో పోటీలను నిర్వహించడానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు. అయితే ఈ మూడు చోట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

తొలిసారిగా చెన్నైలో జల్లికట్టు పోటీలకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రముఖ నటుడు రాజకీయ నేత కమల్ హాసన్. ఎం.ఎం.ఎం తరపున చెన్నైలో జల్లికట్టు పోటీలు నిర్వహించాలని కమల్ హాసన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  ప్రభుతాన్ని అనుమతులు కోరారు. ఒకవేళ స్టాలిన్ ప్రభుత్వం కనుక అనుమతులు ఇస్తే..  తొలిసారిగా జల్లికట్టు పోటీలు చెన్నైమహానగరంలో జరగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..