AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వామ్మో.. వాయమ్మో! చొక్కా గుండీల వెనుక గూడుపుఠాణీ.. చెక్ చేసి చూడగా..

చిక్కకుండా సరికొత్త వ్యూహాలను రచిస్తూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను యదేచ్చగా సాగిస్తున్నారు. అయితే ఖాకీలు ఏం తక్కువ కాదుగా..

Viral: వామ్మో.. వాయమ్మో! చొక్కా గుండీల వెనుక గూడుపుఠాణీ.. చెక్ చేసి చూడగా..
Mumbai
Ravi Kiran
|

Updated on: Jan 07, 2023 | 1:12 PM

Share

కేటుగాళ్లు బాగా తెలివి మీరిపోయారు. పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా సరికొత్త వ్యూహాలను రచిస్తూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను యదేచ్చగా సాగిస్తున్నారు. అయితే ఖాకీలు ఏం తక్కువ కాదుగా.. వాళ్ల తోకలను కత్తిరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సినిమాను తలపించే ఓ సీన్ చోటు చేసుకుంది. మాదకద్రవ్యాలను రవాణా చేస్తోన్న ఇద్దరు ప్రయాణీకుల నుంచి సుమారు రూ. 47 కోట్లు విలువ చేసే కొకెయిన్, హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలానే కస్టమ్స్ అధికారులు శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈలోగా అప్పుడే ల్యాండ్ అయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌ నుంచి దిగిన ప్రయాణీకులను ఒక్కొక్కరిగా చెకింగ్ పాయింట్‌కు గ్రీన్ ఛానెల్ ద్వారా వస్తున్నారు. వారిలో ఓ ప్రయాణీకుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడటంతో.. అతడి బ్యాగ్ చెక్ చేశారు కస్టమ్స్ అధికారులు. అందులో పెద్ద సంఖ్యలో కుర్తా గుండీలు ఉన్నాయి. వాటిని మరింత జాగ్రత్తగా తనిఖీ చేయడంతో.. సదరు గుందీల్లో దాచిపెట్టిన 1.596 కిలోల కొకెయిన్ బయటపడింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 16 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరో కేసులో జోహన్నెస్‌బర్గ్ నుంచి నైరోబీ మీదుగా కెన్యా ఎయిర్‌వేస్‌లో వచ్చిన ఆ దేశానికి చెందిన వ్యక్తి తన హ్యాండ్‌బ్యాగ్‌లో నల్లటి ఫోల్డర్ కవర్లలో దాచి ఉంచిన 4.47 కిలోల హెరాయిన్ కస్టమ్స్ అధికారులకు లభ్యమైంది. దీని మార్కెట్ విలువ రూ. 31 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, కస్టమ్స్ అధికారులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై సెక్షన్ 8 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..