Samatha Kumbh 2025: ముచ్చింతల్ లో వైభవంగా సాగుతున్న సమతాకుంభ్.. తొమ్మిదో రోజు ప్రత్యేకతలు
భగవంతుడు రథాన్ని వాహనంగా చేసుకుని వేంచేస్తాడు. రథంలో వేంచేసిన ఆ సాకేతరాముడ్ని దర్శిస్తే మనం పవిత్రులమవుతామనీ.. కర్మబంధముల నుండి విముక్తులమవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. ముందుగా రథంలో శ్రీ సాకేత రామచంద్ర ప్రభువు వేంచేసారు. తర్వాత 108 దివ్యవేదశ శ్రీమూర్తులలో నుంచి మొదటి దివ్యదేశ పెరుమాళ్లయిన శ్రీరంగనాథుడు, అంతిమ దివ్యదేశ పెరుమాళ్లయిన శ్రీ వైకుంఠనాథుడు వేం చేస్తారు.

సమతాకుంభ్ -2025 బ్రహ్మోత్సవాల తొమ్మిదో రోజు (మంగళవారం-Feb 18) ఉదయం రథోత్సవ ఘట్టం ఘనంగా నిర్వహించారు. యాగశాలలో వేదికపైన 18 దివ్యదేశ పెరుమాళ్లకు తిరుమంజన సేవ అనంతరం రథోత్సవం మొదలైంది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని రథానికి ప్రత్యేకత ఉంది. శ్రీరంగంలో ఉండే ప్రణవాకార విమానంలా..ఈ రథానికి కూడా ప్రణవాకార విమాన గోపురం ఉండటం విశేషం! చుట్టూరా దేవతామూర్తులు, ఆళ్వార్లు, ఆచార్యులు, చతుర్ముఖ బ్రహ్మ, అనేక శిల్పకళా సౌందర్యానికి కాణాచిలా ఉండటం..ఈ రథం ప్రత్యేకత!
భగవంతుడు రథాన్ని వాహనంగా చేసుకుని వేంచేస్తాడు. రథంలో వేంచేసిన ఆ సాకేతరాముడ్ని దర్శిస్తే మనం పవిత్రులమవుతామనీ.. కర్మబంధముల నుండి విముక్తులమవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. ముందుగా రథంలో శ్రీ సాకేత రామచంద్ర ప్రభువు వేంచేసారు. తర్వాత 108 దివ్యవేదశ శ్రీమూర్తులలో నుంచి మొదటి దివ్యదేశ పెరుమాళ్లయిన శ్రీరంగనాథుడు, అంతిమ దివ్యదేశ పెరుమాళ్లయిన శ్రీ వైకుంఠనాథుడు వేం చేస్తారు. శ్రీ సుదర్శన భగవానుడు కూడా రథంలోకి వేం చేస్తారు. గరుడ భగవానుడు, బ్రహ్మతోపాటు విశ్వకర్మ ముందు ఉండటం విశేషం. భగవంతుడు రథంలోకి ప్రవేశించగానే దేవతలకి సాత్విక బలిహరణ జరిగింది.
ఆ తర్వాత గోవింద నామాలతో సంకీర్తనలతో భాజా భజంత్రీలతో కోలాట నృత్యాలతో భక్తులు వెంటరాగా శ్రీస్వామివారు రథయాత్రను ప్రారంభించారు. అనంతరం సమతా ప్రాంగణం ప్రవేశవాటికకు పక్కనున్న ద్వారం గుండా..విరజా పుష్కరిణికి రథయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా పెరుమాళ్లకు మంగళ హారతులు, స్నానాలు చేయించారు. అనంతరం పెరుమాళ్లతో చిన్న జీయర్ స్వామి వారు కోనేరులోకి దిగి స్నానమచరించారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనంతో పాటు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మినీ బస్సుగా మారిన ఆటో..! ఏకంగా 18 మందిని ఎక్కించిన డ్రైవర్.. ఎలాగో మీరే చూడండి..
ఇది కూడా చదవండి: వీళ్ల రీల్స్ పిచ్చి తగలేయా.. బర్త్‌డేను కాస్త డెత్ డేగా మార్చేట్టున్నారుగా.. కేక్ పేలటంతో..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో మంటలు.. 30 రోజుల్లో ఏడోసారి అగ్నిప్రమాదం..
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాలో టీ అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు లక్షాధికారి..! ఒక్కరోజు సంపాదన తెలిస్తే..
ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా.. చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ చూడొచ్చు..! ఇవిగో సూపర్ ట్రిక్స్.. ఎంజాయ్ చేసేయండిలా..
ఇది కూడా చదవండి: ఏసీ కొనాలని చూస్తున్నారా.. అదిరిపోయే ఆఫర్ భయ్యా..ఇక్కడ భారీ తగ్గింపు..!




