Spiritual for Stress: ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అంతా బిజీ అయిపోయింది. తినడం, పడుకోవడం, పని చేయడం అంతా ఫాస్ట్‌గా అయిపోవాలి. అలాగే ఇంట్లోని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల కూడా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. కేవలం ఉద్యోగస్తులే కాదు.. పిల్లలు, మహిళలు సైతం ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ సాధ్య పడదు. కేవలం మనసు మళ్లిస్తే ఒత్తిడి అనేది తగ్గిపోదు. మీ లైఫ్ స్టైల్‌లో..

Spiritual for Stress: ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
Spiritual For Stress
Follow us
Chinni Enni

|

Updated on: Mar 28, 2024 | 5:25 PM

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అంతా బిజీ అయిపోయింది. తినడం, పడుకోవడం, పని చేయడం అంతా ఫాస్ట్‌గా అయిపోవాలి. అలాగే ఇంట్లోని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల కూడా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. కేవలం ఉద్యోగస్తులే కాదు.. పిల్లలు, మహిళలు సైతం ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ సాధ్య పడదు. కేవలం మనసు మళ్లిస్తే ఒత్తిడి అనేది తగ్గిపోదు. మీ లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. హిందూ ధర్మంలో కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఉదయం లేచక కొన్ని రకాల మంత్రాలను జరిపించడం వల్ల ఒత్తిడి నుంచి బయట పడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఓం:

మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఓం కారం అనేది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. ఏకాగ్రతతో తరచూ ఓం అని జపిస్తే.. మీరు ఒత్తిడి నుంచి త్వరగా బయట పడొచ్చు. అలాగే ఓం జపించేటప్పుడు వచ్చే శబ్దం.. మీ నాడీ శ్యవస్థను శాంతి పరుస్తుంది. స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

గాయత్రీ మంత్రం:

రోజూ గాయత్రీ మంత్రం జపించడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడొచ్చు. చాలా పాఠశాలల్లో ఉదయం గాయత్రీ మంత్రాన్ని పిల్లల చేత జపించేలా చేస్తారు. గాయత్రీ మంత్రానికి దైవిక శక్తి ఎక్కువ. రోజూ పఠించడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. భావోద్వేగాలు అనేవి అదుపులో ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హనుమాన్ చాలీసా:

హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదివే వారిలో ధైర్యం, బలం కూడా పెరుగతాయి. మీలో ఎలాంటి ఒత్తిడి, భయాలు ఉన్నా పోతాయి.

మహా మృత్యుంజయ మంత్రం:

శివుడికి చెందిన ఈ మంత్రం.. అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటి. రోజూ మృత్యుంజయ మంత్ర జపించడం వల్ల భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటి ప్రతికూల ఆలోచనల నుండి బయట పడతారు.

ఓం నమశ్శివాయ:

ఒత్తిడి, ఆందోళన వంటిని తగ్గించడంలో ఉపయోగపడే శక్తివంతమైన మంత్రాల్లో ఓం నమశ్శివాయ మంత్రం కూడా ఒకటి. ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించడం వల్ల.. ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే