Samatha Kumbh: నేటి నుంచే రామానుజాచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు..

రామానుజ స్పూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవ సంరంభం మొదలైంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామిజీ ఆధ్వర్యంలో సమతా కుంభ్‌ వేడుకలు ఆరంభం అయ్యాయి.

Samatha Kumbh: నేటి నుంచే రామానుజాచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు..
Samatha Kumbh
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 02, 2023 | 7:53 AM

రామానుజ స్పూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవ సంరంభం మొదలైంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామిజీ ఆధ్వర్యంలో సమతా కుంభ్‌ వేడుకలు ఆరంభం అయ్యాయి. ఇకపై ప్రతీ యేటా ఇదే పేరుతో బ్రహ్మండోత్సవం కనువిందు చేయనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 12 వరకూ ప్రతీ రోజూ పండగే. ప్రతి ఘట్టం సమతా..మమత..సార్వజనీనతకు అద్దం పట్టేలా ఉంటాయి.

కళ్లెదుట ఎన్నెన్నో కమనీయ..రమణీయ దృశ్యాలు. ఇలలో వైకుంఠ వైభవం. జగమంతా పులకరించిన వైదికోత్సవం. మదినిండా భక్తి భావం. నలుదిశల ప్రకాశించిన భక్తి జ్ఞాన వికాస తరంగాలు. అణవుణువునా సమతా స్పూర్తిని నింపిన సహస్రాబ్దిలో మరో మేలి మలుపు. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు న భూతోః.. న భవిష్యత్‌ అన్నట్టు జరగనున్నాయి.

పండుగొచ్చేసింది సాకేత రాముడి సన్నిధి ఇల అయోధ్యగా దీదేప్యమాన్యంగా వెలుగులు విరజిమ్ముతోంది. స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ- సమతా స్పూర్తిని నింపిన మన రామానుజ సన్నిధిలో బ్రహ్మోండోత్సవం. రామానుజాచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవం నేటి నుంచే ప్రారంభం కానుంది. ఉదయం విశ్వక్సేన వీధిశోధన.. సాయంత్రం అంకురారోపణ.. ప్రతీ ఘట్టం రమణీయం.. కమనీయం.. ఇది సకల జనుల సంబురం. తిరుగిరులను తలపిస్తోన్న మన రామానుజ జాతరను దర్శించి తరించాల్సిందే.

ఇవి కూడా చదవండి

అదివో అల్లదివో శ్రీహరివాసం.. అచ్చోట(తిరుమల) సప్తగిరులు.. ఇచ్చోట భక్త సిరులు.. సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడే.. భగవంతుడికి.. భక్తికోటికి అనుసంధానం.. మన రామానుజ మూర్తి.. సమతా స్ఫూర్తి. ఇదిగో.. అన్నయ్య కీర్తించిన ఘనగురువు ఈతడే.

కలియుగ దైవం వేంకటనాథుడంటే.. మన రామానుజకు ఎంతో భక్తి. రామామానుజులంటే తిరుమలేశుడికి ఎంతో అనురక్తి. భక్తాగ్రేసురిడికి గురుస్థానం కల్పించిన కారుణ్య విభువు.. ఆ కోనేటి రాయుడు. బ్రహ్మ కడిగిన పాదానికి బహ్మోత్సవం అంటే.. సప్తగిరుల్లోనే కాదు ఏడేడులోకాల్లో బ్రహ్మోండోత్సవం.

ఎంత రమణీయం.. ఎంత మనోహరం.. ఆ సొగసు చూడతరమా.. భక్తుడి కోసం కదిలి వచ్చిన దేవాధిదేవుళ్లు.. తిరుమల సహా 108 దివ్య దేశాల వైభవం ఒక చోట.. మనకళ్లెదుట సహస్రాబ్ది సమారోహ వార్షికోత్సవం.. మన రామానుజాచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవం. విశ్వేకసేన ఆరాధనతో సమతా కుంభ్‌ 2023 సమారంభం.. సామాన్యులకు.. మాన్యులకే కాదు దేవతాలకూ.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా ప్రతిబంధకాలు ఎదురువుతుంటాయి. వాటిని తొలిగించి భగవత్‌ కార్యాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయం చేసే నాయకుడే విశ్వేకసేనుడు.

అదీ బ్రహ్మోత్సవాల్లో విశ్వక్సేనుడి ప్రాముఖ్యత. బెత్తంపట్టి విఘ్నాలు తొలగించడం మాత్రమే కాదు, బ్రహ్మోత్సవాల అంకురార్పణలో మత్ససంగ్రహనం జరిగేదే విశ్వక్సేనుడి ఆధ్వర్యంలోనే. బ్రహ్మోత్సవాల ఆరంభానికి ముందు మట్టిని సేకరించి నవధాన్యాలను మొలకెత్తించడమే అంకురార్పణ బ్రహ్మోత్సవం. 108 దివ్యదేశాలు కొలువైన మన రామానుజ భవ్య సన్నిధిలో కనులవిందైన మహోత్సవం.. ప్రతీరోజు పండగే.. ప్రతీగడియ విశేషమే.. ఇల వైకుంఠపురం మన కళ్లెదుట.. ఎంత భవ్యం.. మనదెంత భాగ్యం.. రండి.. దర్శించండి.. తరించండి.. వందే గురుపరంపరాం.. ఓం నమో నారాయణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..