AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుని గదిలో ఇవి అస్సలు పెట్టకూడని వస్తువులు.. ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి..

ఇకపోతే, పూజ గదిలో విగ్రహాలను తూర్పు లేదా పడమర వైపు ఉండేలా అమర్చాలి. విగ్రహాలను గోడకు పూర్తిగా ఆనించకుండా కొంచెం దూరంగా పెట్టాలి. అప్పుడే ధూపం, దీపాల సువాసన బాగా వ్యాపిస్తుంది. అలాగే రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా చూసేలా పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు.

దేవుని గదిలో ఇవి అస్సలు పెట్టకూడని వస్తువులు.. ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి..
Pooja Room
Jyothi Gadda
|

Updated on: Sep 05, 2025 | 1:07 PM

Share

హిందూమతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ ప్రదేశం తప్పనిసరిగా ఉంటుంది. కొంతమందికి ఇంట్లో దేవుడి గది సపరేట్‌గా ఉంటే మరి కొంతమందికి హాల్లో లేకపోతే.. కిచెన్ లో ఉంటుంది..అయితే, పూజ గదిలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది మన పూజగదిలో ఎప్పుడూ కూడా నవగ్రహాల పటం ఉండకూడదని అంటున్నారు.

దేవుని గది సపరేటుగా ఉంటేనే.. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు. అలాకాకుండా దేవుని గడి కిచెన్ లో, లేకపోతే హాల్లో ఉన్నట్లయితే.. పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, శని భగవానునికి సంబంధించిన ఫోటో పూజగదిలో పెట్టుకోకూడదు. ఇంట్లో శని భగవానునికి తైలాభిషేకం చేయకూడదు. గుడిలో మాత్రమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే, పూజ గదిలో విగ్రహాలను తూర్పు లేదా పడమర వైపు ఉండేలా అమర్చాలి. విగ్రహాలను గోడకు పూర్తిగా ఆనించకుండా కొంచెం దూరంగా పెట్టాలి. అప్పుడే ధూపం, దీపాల సువాసన బాగా వ్యాపిస్తుంది. అలాగే రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా చూసేలా పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..