Lord Hanuman: కుటుంబంలో సుఖసంతోషాలు లేవా.. అయితే పితృదేవతలను ఇలా పూజించండి..
Lord Hanuman: జాతకంలో పితృ దోషం ఉంటే.. ఆ మనిషి జీవితం కష్టాలతో నిండిపోతుంది. అటువంటి వారు సంకటాలను తొలగించే హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తే..మంచి ఫలితాలు పొందవచ్చు. కలియుగంలో కష్టాలు తీర్చే దేవుడిగా ఆంజనేయ స్వామిని భావిస్తారు. ఆయన ఇప్పటికీ భూమిపై ఉన్నారని భక్తుల నమ్మకం.
Lord Hanuman: జై హనుమాన్ ఈ ఒక్క మాట అన్ని భయాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. హనుమంతుని పూజిస్తూ.. సుందరకాండ పారాయణాన్ని క్రమం తప్పకుండ చేస్తూ.. బెల్లం, పప్పును సమర్పించాలి. అంతేకాదు పితృ దోషాలు తొలగి.. శుభఫలితాలు పొందాలంటే.. ఆంజనేస్వామిని పూజించండి. జీవితంలో బాధలు, కష్టలు తొలగి సంతోషంగా జీవిస్తారు.
హనుమంతుడు రామ భక్తుడు. సీతాదేవిని తల్లిగా భావిస్తాడు. ఎక్కడ సీతారాముల సంకీర్తన జరుగుతుందో.. అక్కడ ఆంజనేస్వామి ఉంటాడని భక్తుల నమ్మకం. కనుక రోజూ తప్పకుండా సీతారాముల సంకీర్తనను భక్తితో చేయాలి. తమ బాధలు, కష్టాలు తొలగించమని ప్రార్ధించాలి.
రామచరితమానస్ లోని సుందరకాండ హనుమాన్ కు అత్యంత ప్రీతికమైంది. ఎవరైనా తమ కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవించాలంటే.. స్వచ్ఛమైన హృదయంతో ప్రతిరోజూ సుందర కాండ ను పఠించండి. ప్రతిరోజూ సుందరకాండ పారాయణం చేయలేకపోతే.. కనీసం మంగళవారం, శనివారం అయినా చేయండి.
సుందర్‌కాండ పారాయణం హనుమంతుడు, శ్రీరాముడు ఇద్దరికీ ప్రియమైంది. దీనితో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
శ్రీకృష్ణుడు కూడా శ్రీరాముని వలెనే నారాయణుని రూపమే. కృష్ణ అవతారంలో గీతను బోధించాడు. పూర్వీకుల మోక్షం కోసం క్రమం తప్పకుండా గీతా పఠించేవారు. మోక్షం పొందిన పితృదేవతలు .. తమ కుటుంబానికి వారసులపై అనుగ్రహం కురిపిస్తారు. పెద్దల ఆశీసులున్న కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Also Read: