Dhanurmasam Thiruppavai: నేడు తిరుప్పావై 23వ పాశురం.. గోపికలతో కూడిన ఆండాళ్ అమ్మవారు తమ మనోభీష్టాన్ని ఇలా..

ఆ మహా విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగం. తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని.

Dhanurmasam Thiruppavai: నేడు తిరుప్పావై 23వ పాశురం.. గోపికలతో కూడిన ఆండాళ్ అమ్మవారు తమ మనోభీష్టాన్ని ఇలా..
Thiruppavai Pasuram Day 23
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 07, 2022 | 8:55 AM

Dhanurmasam Thiruppavai: ఆ మహా విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగం. తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. తిరుప్పావై పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. విష్ణు భక్తులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ధనుర్మాసంలో నేడు 23వ రోజు.. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 23వ పాశురం.

మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్

శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు

వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి

మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు

పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్

కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ

శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద

కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

అర్థం: వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!’ అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.

ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..

గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..