AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఈ లక్షణాలను తప్పక గమనించండి..

Chanakya Niti: ఒకరిని విశ్వసించే ముందు వారిని క్షుణ్ణంగా పరీక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. నమ్మిన వ్యక్తితోనే అన్నీ షేర్ చేసుకుంటాం. వాటిలో వ్యక్తిగత రహస్యాలు కూడా ఉండొచ్చు.

Chanakya Niti: ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఈ లక్షణాలను తప్పక గమనించండి..
Acharya Chanakya
Shiva Prajapati
|

Updated on: Jan 07, 2022 | 8:37 AM

Share

Chanakya Niti: ఒకరిని విశ్వసించే ముందు వారిని క్షుణ్ణంగా పరీక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. నమ్మిన వ్యక్తితోనే అన్నీ షేర్ చేసుకుంటాం. వాటిలో వ్యక్తిగత రహస్యాలు కూడా ఉండొచ్చు. అలాంటి నేపథ్యంలోనే.. ఒక వ్యక్తిని విశ్వసించే ముందు వారిలో కొన్ని లక్షణాలను పరీక్షించాలని ఆచార్య చాణక్యుడు చెబుతారు. ఎదుటి వారిని విశ్వసించే ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలపై పరీక్షించాలని సూచించారు. వాటి ఆధారంగా మీరు ఆ వ్యక్తిని విశ్విసించాలా? వద్దా? అని తెలుసుకోవచ్చు. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒకరిని చూసిన వెంటనే నిర్ణయానికి రావడం అనేది పెద్ద తప్పు. మనుషులందరూ పైకి కనిపించినట్లుగా ఉండరు. కావున ఒక వ్యక్తిని వారి ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. వారి ప్రవర్తనను పరీక్షించడానికి మీరు వారితో ఉండాల్సి ఉంటుంది. 2. వ్యక్తితో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు.. వారిలో త్యాగ గుణం ఉందో లేదో గమనించండి. త్యాగం చేసే స్ఫూర్తిని కలిగి ఉన్న వ్యక్తులు, ఇతరుల బాధలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు ఇతరులకు కూడా సహాయం చేస్తారు. వారిలో మనస్సాక్షి సజీవంగా ఉంటుంది. 3. చేసే పనిని బట్టి కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తే, వారి ఖచ్చితంగా తెలివిగా ఉంటారు. లేదంటే ఎప్పటికీ ఆ వ్యాపారంలో రాణించలేరు. అదేవిధంగా, ఒక వ్యక్తి ఏ పని చేస్తాడో, అలాంటి లక్షణాలే వారిలో ఉంటాయి. కష్టపడి డబ్బు సంపాదించే వ్యక్తులకు ఆత్మగౌరవం ఉంటుంది. అలాంటి వారిని నమ్మవచ్చు. 4. వ్యక్తి ప్రవర్తనను పరీక్షించండి. మీరు ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లయితే.. ఇతరుల పట్ల వారు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారో పరిశీలించండి. ఇతరుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని మీరు తప్పకుండా విశ్వసించవచ్చు.

Also read:

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరగని ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి..

Sleeping: నిద్ర పట్టడం లేదా.. వెంటవెంటనే మేల్కొంటున్నారా.. అయితే ఇవే కారణాలు కావొచ్చు జాగ్రత్త..

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది