AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగ‌డం ఎంతో ప్రాక్టీస్‌ ఉంటే కానీ సాధ్యం కాదు. అదో పెద్ద సాహ‌సం అనే చెప్పాలి. సాహ‌సం క‌న్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవ‌చ్చు. కానీ...

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది
Subhash Goud
|

Updated on: Jan 07, 2022 | 8:21 AM

Share

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగ‌డం ఎంతో ప్రాక్టీస్‌ ఉంటే కానీ సాధ్యం కాదు. అదో పెద్ద సాహ‌సం అనే చెప్పాలి. సాహ‌సం క‌న్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవ‌చ్చు. కానీ.. పంజాబ్‌కు చెందిన‌ ఆశా రాణి అనే మ‌హిళ త‌న జ‌డ‌తో డ‌బుల్ డెకర్‌ బ‌స్సును సునయాసంగా లాగింది. ఇక బస్సు బ‌రువు అక్షరాల 12,126 కేజీలు. అన్ని వాహ‌నాల్లోనే అత్యంత బ‌రువు ఉన్న వాహ‌నం. దీన్ని త‌న జ‌డ‌తో లాగి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు క్రియేట్ చేసింది ఆశా రాణి. 2016లోనే ఆశా రాణి ఇట‌లీలో ఈ ఫీట్‌ను సాధించింది. త‌న‌కు ఐర‌న్ క్వీన్ అనే బిరుదును కూడా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్రతినిధులు ఇచ్చారు. అలాగే.. గిన్నిస్ బుక్‌లో త‌న పేరును న‌మోదు చేశారు. తాజాగా అప్పటి వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్‌స్టా పేజీలో షేర్ చేయ‌డంతో ఆ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే గిన్నిస్‌బుక్‌లో రికార్డు సంపాదించడం ఆషామాషీ కాదు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పట్టుదల, ఒపిక ఇలా ఎన్నో విధాలుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఇది వరకే ఏడు గిన్నిస్‌ బుక్‌ రికార్డులు సాధించింది. గతంలో ఆమె పళ్లతో 22.16 సెకండ్ల వ్యవధిలో ఓ కారును 25 మీటర్ల దూరం లాగింది. 2013లో తన చెవులతో1700 కిలోల బరువున్న వాహనాన్ని లాగి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరో రికార్డు సృష్టించి ఔరా అనుపించుకుంది.

ఇవి కూడా చదవండి:

Railway Station: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్‌, టెర్మినల్‌ అని పేర్లతో ఎందుకు పిలుస్తారు..?

Cow Milk: ఆవు పాలు లేత పసుపు రంగులో.. గేదె పాలు తెల్లగా ఎందుకుంటాయి..?

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!