Sampreeti Yadav: గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం.. ఈ యువతి వేతనం కోటీపైనే..!

Sampreeti Yadav: టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్‌ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ తరుణంలో భారత్‌ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి.

Sampreeti Yadav: గూగుల్‌లో మరో భారతీయ ఆణిముత్యం.. ఈ యువతి వేతనం కోటీపైనే..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2022 | 8:52 AM

Sampreeti Yadav: టాలెంట్‌ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో టెక్‌ దిగ్గజ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. ఈ తరుణంలో భారత్‌ నుంచి ఎక్కువ మేధోసంపత్తిని వెలికి తీస్తుంటాయి. బడా బడా కంపెనీల సీఈవోలుగా భారత మూలాలు ఉన్నవాళ్లు, భారీ ప్యాకేజీలు అందుకుంటున్న వాళ్లలో భారతీయ టెక్కీలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారత యువతికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో బంపరాఫర్‌ ఇచ్చింది గూగుల్‌.

బిహార్‌లోని పట్నాకు చెందిన సంప్రీతి యాదవ్‌ గూగుల్‌ నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో అదరగొట్టింది. చదువు, ఆటలు, సంగీతం, అన్నింట్లోనూ ముందుండే సంప్రీతి.. గూగుల్‌లో కోటీ పదిలక్షల వేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించింది. ఉన్నత స్థాయిలో స్థిరపడి, అమ్మానాన్నకి మంచి పేరు తేవడం సంప్రీతి కల. టెన్త్‌, ఇంటర్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చిన సంప్రీతి.. ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో గత ఏడాదే కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక అదే క్యాంపస్‌ డ్రైవ్‌లో అడోబ్‌, ఫ్లిప్‌కార్ట్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉద్యోగావకాళను దక్కించుకుంది. కానీ చివరకు మైక్రోసాఫ్ట్‌ను ఎంచుకొని చేరింది. అక్కడ సంప్రీతి వార్షిక వేతనం 44లక్షలుగా ఉంది. ఈ సంస్థలో ఉద్యోగం చేస్తూనే గూగుల్‌ సంస్థ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో సక్సెస్‌ఫుల్‌గా సెలక్ట్‌ అయి 1.10కోట్ల వార్షిక వేతనంతో కొలువు దక్కించుకుంది.

Also read:

Chanakya Niti: ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఈ లక్షణాలను తప్పక గమనించండి..

Andhra Pradesh: విజయనగరంలో మిస్టరీగా మారిన కానిస్టేబుల్ మిస్సింగ్.. అసలేం జరిగిందంటూ..

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇకపై అది తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన టెంపుల్ ఈవో..