Sleeping: నిద్ర పట్టడం లేదా.. వెంటవెంటనే మేల్కొంటున్నారా.. అయితే ఇవే కారణాలు కావొచ్చు జాగ్రత్త..

Sleeping Problem: ప్రస్తుత కాలంలో నిద్రలేమి కూడా పెద్ద సమస్యగా మారుతోంది. కొందరికి నిద్ర సరిగా ఉండదు. వచ్చినా రాత్రికి మళ్లీ మళ్లీ లేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో

Sleeping: నిద్ర పట్టడం లేదా.. వెంటవెంటనే మేల్కొంటున్నారా.. అయితే ఇవే కారణాలు కావొచ్చు జాగ్రత్త..
Sleeping
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2022 | 8:25 AM

Sleeping Problem: ప్రస్తుత కాలంలో నిద్రలేమి కూడా పెద్ద సమస్యగా మారుతోంది. కొందరికి నిద్ర సరిగా ఉండదు. వచ్చినా రాత్రికి మళ్లీ మళ్లీ లేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారి శరీరం విశ్రాంతి పొందదు. దీంతో దాని ప్రతికూల ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తుంది. దీనివల్ల రోజంతా అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలతో పాటు ఏ పనీ పూర్తి ఏకాగ్రతతో చేయలేకపోతుంటారు. ముఖ్యంగా చిరాకు, కోపం లాంటివి బాగా పెరుగుతాయి. మనిషికి సరిపడా నిద్ర పట్టకపోతే క్రమంగా రోగాల బారిన పడటం ఖాయమంటున్నారు.. వైద్య నిపుణులు. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే.. మీరు దాని కారణాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. మీరు తరచుగా రాత్రిపూట మెలుకువ వస్తుంటే.. నిద్ర సరిగా పోకపోతే.. దానికి కొన్ని కారణాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.

టెన్షన్ ఈ రోజుల్లో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్య. ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు నిద్రపోలేరు. అలాంటి వారు ఏదో ఒక విధంగా నిద్రపోయినప్పటికీ మళ్లీ మళ్లీ నిద్ర నుంచి తేరుకుంటుంటారు.

థైరాయిడ్ థైరాయిడ్ రోగులు కూడా ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. వాస్తవానికి థైరాయిడ్ హార్మోన్లు అసమతుల్యత వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పెరిగినప్పుడు, గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో నిద్రలేమి సమస్య మొదలవుతుంది.

నిద్రలేమి సాధారణంగా నిద్రలేమి కూడా దీనికి కారణం కావచ్చు. ఇది మీకు రాత్రిపూట నిద్రపోకుండా రోజంతా అలసిపోయేలా చేసే నిద్ర రుగ్మతలలో ఒకటి. నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తి నిద్రపోవడం, తరచుగా నిద్రనుంచి తేరుకోవడం, రాత్రి మేల్కొన్న తర్వాత మళ్లీ నిద్రపోవడం, అయినా నిద్రపట్టకపోవడం జరుగుతుంటుంది.

సోషల్ మీడియా వ్యసనం నిద్రలేమి సమస్యకు మొబైల్, సోషల్ మీడియాకు బానిస కావడం కూడా కారణం కావచ్చు. మొబైల్ కాంతి నేరుగా మీ కళ్లపై పడుతుంది. దీని కారణంగా, శరీరం మెలటోనిన్, స్లీప్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీని కారణంగా నిద్ర చెదిరిపోతుంది.

స్లీప్ అప్నియా స్లీప్ అప్నియా అనేది ఒక సమస్య. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో పదేపదే ఇబ్బంది పడటం వలన నిద్ర సరిగా పోలేరు. దీని వలన మీరు సరిగా నిద్ర పోకుండా రోజంతా నిరసంగా ఉంటారు.

ఈ అలవాట్లు కూడా.. రాత్రిపూట టీ లేదా కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. ఇది కాకుండా.. పని చేసే వ్యక్తులు తరచుగా వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోతారు.. ఆ తర్వాత ఉదయం చాలాసేపు నిద్రపోతారు. ఇది వారి శరీరంలోని జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కూడా నిద్ర పట్టకపోవడం సమస్యగా మారుతుంది.

Also Read:

Jobs Recruitment: కరోనా ఆంక్షలు విధించకపోతే నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు..!

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది