Temple Renovation: టెక్నాలజీ సాయంతో ఆలయంలో కీలక మార్పులు.. మండపం, విగ్రహాన్ని..
ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ సాయంతో పల్లంలో ఉన్న ఇళ్లు, అపార్టమెంట్లను జాకీల సాయంతో ఎత్తు పెంచుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు.. ఓ సంస్థ ద్వారా ఎత్తు పెంచేందుకు..
ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ సాయంతో పల్లంలో ఉన్న ఇళ్లు, అపార్టమెంట్లను జాకీల సాయంతో ఎత్తు పెంచుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు.. ఓ సంస్థ ద్వారా ఎత్తు పెంచేందుకు పనులు ప్రారంభించారు. అదే టెక్నాలజీ సాయంతో పెనమాకలో ఆలయంలో మార్పాలకు శ్రీకారం చుట్టారు. జాకీల సాయంతో విగ్రహాల స్థాన చలనం చేస్తున్నారు. వైష్ణవాలయంలో భగద్రామానుజల విగ్రహం సమీపంలోనే రాజగోపురం నిర్మాణం చేశారు. రాజగోపురం ఎదురుగా స్వామి వారి విగ్రహాన్ని తరలించాలని నిర్ణయించారు. ఇందుకు గాను భగద్రామానుజల విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహ మండపాన్ని మార్చాలని ఒక సంస్థకు అప్పగించారు.
ఆ సంస్థ రెండు కట్టడాలను నిర్వాహకుల సూచనల మేరకు మార్చేందుకు పదమూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు కట్టడాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జాకీల సాయంతో మార్పు చేస్తున్నారు.
గతంలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ప్రయోగాలు ఇంటి ఎత్తు పెంచేందుకు ఉపయోగించారు. అయితే ఇలా ఆలయ మార్పుల్లో జాకీలను ఉపయోగించడం ఇదే తొలిసారి. అదే విధంగా ఈ ఆలయంలో ఎత్తు పెంచడంతోపాటు విగ్రహాల స్థానచలనం చేశారు. ఈ పనులను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పది రోజుల క్రితం ప్రారంభమైన పనులు మరో నెల రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఇప్పటికే తరలింపు కట్టడాలకు జాకీల అమరిక పూర్తయింది. త్వరలోనే తరలింపు మొదలవనుంది.
ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..
గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..