Yadadri: వైభవంగా యాదాద్రి ఆలయ మహాకుంభాభిషేకం.. నాలుగో రోజుకు చేరుకున్న పంచకుండాత్మక యాగం..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణ వేడుక నేత్రపర్వంగా సాగుతోంది. బాలాలయంలో పంచకుండాత్మక యాగం శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛరణలతో వైభవంగా సాగుతోంది. ఆలయ పరిసరాలు ఆధ్మాత్మిక శోభను..

యాదాద్రి (Yadadri)లక్ష్మీనరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణ వేడుక నేత్రపర్వంగా సాగుతోంది. బాలాలయంలో పంచకుండాత్మక యాగం(Panchakundatmaka Yagam) శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛరణలతో వైభవంగా సాగుతోంది. ఆలయ పరిసరాలు ఆధ్మాత్మిక శోభను సంతరించుకున్నాయి. సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో సాగుతున్న పంచకుండాత్మక యాగం భక్తులను కనువిందు చేసింది. ఈ నెల 28వరకు సాగనున్న పంచకుండాత్మక యాగంలో మూలమంత్ర హవనం, జలాధివాసం, నిత్య మహానివేదన నిర్వహించారు. స్వామివారిని పూలమాలలతో రమణీయంగా అలంకరించారు. పంచకుండాత్మక యాగం ఇవాళ నాలుగో రోజుకు చేరుకుంది. 24 సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైన నేయితో యాగం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు అర్చకులు.
స్వామివారి వైభవానికి, యశస్సుకు ఏమాత్రం తగ్గకుండా పూజలు చేస్తున్నారు అర్చకులు. యాగం ఆసాంతం ప్రధానాచార్యుల ఆధ్వర్యంలో.. 108 మంది రుత్విక్కులతో వేదమంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా సాగింది. ఉదయం 9 గంటలకు స్వామివారికి శాంతిపాఠం నిర్వహించారు.
ఆ తర్వాత చతుస్థానార్చనలు నిర్వహించారు. యాగశాలలో మూలమంత్ర హవనం, పంచ వింశతి కలశ అంటే.. 25 వెండి కలశాలతో స్వామివారికి స్నపనం కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రపారాయణం, జలాధివాసం, నిత్యమహానివేదన, నిత్య లఘు, పూర్ణాహుతి కార్యక్రమాలు కొనసాగాయి.
ఇవి కూడా చదవండి: TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. అయినా కష్టమొచ్చింది..
