Chanakya Niti: ఆరోగ్యాన్ని, సంపదను సైనికుడిలా రక్షించమంటున్న చాణక్య ఎందుకంటే..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakyudu) మంచి ఆర్థికవేత్త, వ్యూహకర్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త.  ఆయన తన జీవితంలో  నేర్చుకున్న అనుభవాలను ప్రజల ప్రయోజనాల కోసం..

Chanakya Niti: ఆరోగ్యాన్ని, సంపదను సైనికుడిలా రక్షించమంటున్న చాణక్య ఎందుకంటే..
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2022 | 9:42 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakyudu) మంచి ఆర్థికవేత్త, వ్యూహకర్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త.  ఆయన తన జీవితంలో  నేర్చుకున్న అనుభవాలను ప్రజల ప్రయోజనాల కోసం పుస్తకాలుగా రాశాడు. చాణక్య నీతి అత్యంత ప్రజాదరణ పొందింది. ఆచార్య తన జీవితంలో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సొంతం చేసుకున్నాడు. తనకు ఎదురయ్యే పరిస్థితికి అనుగుణంగా  కష్టపడి పని చేస్తూనే అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన ప్రతి అంశం గురించి తెలిపాడు. ఆచార్య ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి సైనికుడిలా రక్షించమని చెప్పిన ఓ రెండు విషయాల గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం.

ఆరోగ్యం: ప్రతి మనిషి మొదట తన ఆరోగ్యనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పాడు. ప్రతి వ్యక్తి తన శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని. వ్యాధుల బారిన పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఒక సైనికుడు తన దేశాన్ని శత్రువుల నుండి రక్షించుకోవడానికి ఎలా ప్రయత్నాలు చేస్తాడో.. అదే విధంగా మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధులు మీ శరీరానికి శత్రువులు. ఒకసారి ఈ శత్రువులు మీ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి తినే ఆహారం, దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. ఎల్లప్పుడూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయండి.

డబ్బు: డబ్బు కూడా చాలా ముఖ్యమని ఆచార్య భావిస్తారు. మిమ్మల్ని కష్టకాలంలో మిమ్మల్ని మీరు దాచుకున్న సంపద మాత్రమే నిజమైన స్నేహితుడిలా కాపాడుతుంది. సంపద సహాయంతో మీరు జీవనోపాధి పొందగలుగుతారు. కాబట్టి మీ డబ్బును వృధాగా ఖర్చు చేయకండి.  ఆదా చేసుకోండి.  డబ్బు ఎక్కువగా ఉంటే పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను మరింత పెంచుకోండి. అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా సంపదను వినియోగించండి. మీ ప్రతిష్ట పెరుగుతుంది.

Read Also: Summer Season: వేసవి వచ్చేసింది.. ఈ సీజన్‌లో మీ గుండెను ప్రభావితం చేసే 5 వ్యాధులు ఇవే.. జర భద్రం!