AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi: ‘ఆలియా’ అంటే ఆమాత్రం ఉంటది మరి.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన పాక్ నటుడు..!

Gangubai Kathiawadi: తమ అభిమాన నటుడు, నటి సినిమాల విడుదల అవుతుందంటే చాలు ప్రేక్షకులు సమయానికి ముందే థియేటర్ వద్దకు వెళ్లి టికెట్ల కోసం గంటలు గంటలు వేచి ఉంటారు. మరికొందరు వేలకు వేలు పెట్టి

Gangubai Kathiawadi: ‘ఆలియా’ అంటే ఆమాత్రం ఉంటది మరి.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన పాక్ నటుడు..!
Alia Bhutt
Shiva Prajapati
|

Updated on: Mar 24, 2022 | 9:06 PM

Share

Gangubai Kathiawadi: తమ అభిమాన నటుడు, నటి సినిమాల విడుదల అవుతుందంటే చాలు ప్రేక్షకులు సమయానికి ముందే థియేటర్ వద్దకు వెళ్లి టికెట్ల కోసం గంటలు గంటలు వేచి ఉంటారు. మరికొందరు వేలకు వేలు పెట్టి మరీ టికెట్లు కొనుగోలు చేస్తారు. ప్రేక్షకుల అభిమానం ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. అయితే, ఒక స్టార్ సినిమాను చూసేందుకు మరో స్టార్ ఏకంగా థియేటర్‌నే బుక్ చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేకపోతే ఇప్పుడు చూసేయండి. ఆలియా భట్ నటించిన ‘గంగూభాయ్ కతియవాడి’ సినిమాను చూసేందుకు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఏకంగా సినిమా థియేటర్‌నే బుక్ చేసుకున్నాడు.

పాకిస్తానీ నటుడు మునీబ్ భట్.. తన భార్యతో కలిసి అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాను చూసేందుకు దుబాయ్‌లో ఒక థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. భార్యభర్తలిద్దరూ కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ నటుడు మునీబ్ భట్.. తన భార్య ఐమాన్ ఖాన్, కుమార్తె అమల్ మునీబ్‌తో కలిసి దుబాయ్ విహారయాత్రలో ఉన్నాడు. అయితే, మునీబ్ తన భార్య కోసం ఆలియా భట్ నటించిన ‘గంగూబాయ్ కతియావాడి’ ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం మొత్తం థియేటర్‌ను బుక్ చేశాడు. వీరిద్దరూ థియేటర్‌లో సినిమా వీక్షిస్తున్న వీడియోను మునీబ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడి’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శంతను మహేశ్వరి, విజయ్ రాజ్ సహా మునీబ్ బట్ కూడా నటించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించి.. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఎస్ హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కథియావాడ్‌కి చెందిన ఒక అమ్మాయిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టడం, ఆ జీవితం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

Also read:

Simbu: చిక్కుల్లో స్టార్ హీరో.. శింబు కారు డ్రైవర్ అరెస్ట్.. ఎందుకంటే..

RRR Movie: చివరి క్షణంలో ఫ్యాన్స్‏కు షాకిచ్చిన ఆర్ఆర్ఆర్.. అక్కడ మాత్రమే బెనిఫిట్ షోస్..

KGF 2: తీరం దాటిన తుఫాన్‌.. ఇక ఎవ్వరూ ఆపలేరంతే !!