Simbu: చిక్కుల్లో స్టార్ హీరో.. శింబు కారు డ్రైవర్ అరెస్ట్.. ఎందుకంటే..

తమిళ్ స్టార్ హీరో శింబు (Simbu) మరోసారి చిక్కుల్లో పడ్డాడు.. శింబు కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనలో అతని కారు డ్రైవర్‏ను పోలీసులు

Simbu: చిక్కుల్లో స్టార్ హీరో.. శింబు కారు డ్రైవర్ అరెస్ట్.. ఎందుకంటే..
Simbu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2022 | 8:59 PM

తమిళ్ స్టార్ హీరో శింబు (Simbu) మరోసారి చిక్కుల్లో పడ్డాడు.. శింబు కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనలో అతని కారు డ్రైవర్‏ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 18న రాత్రి శింబు తండ్రి.. నటుడు టీ. రాజేందర్ కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ వృద్దుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. అటు నుంచి వస్తున్న వాహనాల వెలుగులలో వృద్ధుడి గమనించని డ్రైవర్ కారు నడపడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన నటుడు టీ. రాజేంద్రన్ వెంటనే అంబులెన్స్‏కు సమాచారం అందించారు. ప్రమాదానికి కారమైన కారు డ్రైవర్‏ను కూడా ఆ వృద్దుడి వెంట ఆసుపత్రికి పంపించారు. ఆరోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు.

ఇదిలా ఉంటే.. ప్రమాదానికి కారణమైన శింబు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‏కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. అయితే ఈ విషయంపై శింబు ఇంకా స్పందించలేదు. ప్రమాదానికి కారణమైన కారు హీరో శింబు పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read: కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్‌.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..

Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

SSMB 29: మహేష్.. రాజమౌళి సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్రప్రసాద్.. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ అంటూ..

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్’