కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్‌.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..

కార్తీకదీపం (Karthika Deepam) . బుల్లితెరపై మరో సెన్సెషన్. ఈ సీరియల్‎కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత మూడేళ్లుగా

కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్‌.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..
Karthika Deepma
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 24, 2022 | 4:55 PM

కార్తీకదీపం (Karthika Deepam) . బుల్లితెరపై మరో సెన్సెషన్. ఈ సీరియల్‎కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత మూడేళ్లుగా బుల్లితెరపై రికార్డ్స్ సృష్టిస్తూ.. అగ్ర స్థానంలో దూసుకుపోతుంది. ప్రముఖ ఛానల్లో ప్రసారమౌతున్న సీరియల్‌ ‘కార్తీక దీపం’. ఈ సీరియల్‌కి పోటీ ఇచ్చే సీరియల్ దరిదాపుల్లో కూడా వేరే సీరియల్స్‌ ఉండేవి కావు . 21.01 టీఆర్పీ సాధించి.. ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ సీరియల్‌గా ఘనత సాధించింది. తెలుగులోనే కాదు జాతీయ స్థాయిలో ఈ స్థాయి రేటింగ్‌ మరే సీరియల్‌కి లభించలేదు. మూడున్నరేళ్లుగా టాప్ రేటింగ్‌తో దూసుకుపోతూ బుల్లితెర బాహుబలిగా అవతరించింది కార్తీకదీపం.

ఇదంగా నిన్న మొన్నటి మాట. ఇప్పుడు లెక్కలు మారిపోతున్నాయ్.. 18-21 మధ్య రేటింగ్ సాధిస్తూ టాప్ గేర్‌లో దూసుకుని పోయే ఈ సీరియల్‌కి గడ్డు పరిస్థితులు వచ్చాయి. బార్క్ రేటింగ్‏లో వారం వారం పతనమౌతూ వస్తుంది. తాజాగా 43 వారానికి సంబంధించిన బార్క్ రేటింగ్‌లో 15.36 రేటింగ్‌కి మాత్రమే పరిమితం అయ్యింది. 42వ వారంలో 14. 76 కు, 41వ వారంలో 12. 92 కి కార్తీకదీపం సీరియల్‌ పడిపోయింది. కార్తీకదీపం సీరియల్‌ ఇప్పుడు కూడా టాప్‌లోనే ఉంది. గతంలో తన కాంపిటేర్స్‌కి కార్తీకదీపం సీరియల్‌కి వ్యత్యాసం చాలా తేడా ఉండేది. ఉదాహరణకు కార్తీకదీపం సీరియల్ 18-20 మధ్య రేటింగ్‌లో ఉంటే.. ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, దేవత వంటి సీరియల్స్ 10-12లను దాటే పరిస్థితి ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే కార్తీకదీపం సీరియల్ రేటింగ్‌లో పతనం మొదలైందో, ఆ సీరియల్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం 43వ వారంలో 15.36 రేటింగ్ సాధిస్తే.. గుప్పెడంత మనసు 13.40 రేటింగ్‌తో తరువాతి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంటింటి గృహలక్ష్మి 13.16 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది. దేవత సీరియల్ కూడా 12.26 రేటింగ్ సాధించి గట్టి పోటీ ఇస్తుంది. ఈలెక్కన కార్తీకదీపం సీరియల్‌కి మూడు సీరియల్స్‌ రేటింగ్‌కి పెద్ద వ్యత్యాసం లేదు. ఇదే సోదితో కార్తీకదీపం సాగదీస్తే మాత్రం.. కార్తీకదీపం సీరియల్‌ని బీట్ చేయడానికి ఆ రెండు సీరియల్స్‏కి ఎంతో సమయం పట్టకపోవచ్చునంటున్నారు వీక్షకులు..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్తీకదీపం సీరియల్‌ని ఎంతో మంది అభిమానులున్నారు. ఒకో సందర్భంలో.. ఇంకెన్నాళ్లు సాగదీస్తాడ్రా బాబూ.. అనుకునే లోపే, ఏదో ఒక ట్విస్ట్ పెట్టి టీవీలకు అతుక్కుపోయేట్టు చేస్తుంటాడు దర్శకుడు రాజేంద్ర.. అయితే ఎప్పుడైతే మోనిత నెల తప్పిందో అక్కడ నుంచి కథ గాడి తప్పింది.. ఆ దర్శకుడు కాపుగంటి రాజేంద్రకు కథను ఎటు నుంచి ఎటు తిప్పాలో తెలియక తాను తికమక పడుతూ.. ఆడియన్స్‌ని తికమకపెట్టేస్తున్నాడు. నిజానికి మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్‌‌‌తో మెలిక పెట్టి మంచి హైప్ వచ్చేట్టు చేశాడు దర్శకుడు. ఆడియన్స్ బోరింగ్‌గా ఫీల్ అయిన ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ పెట్టి కథను ఉత్కంఠగా నడిపించడంలో దర్శకుడు దిట్ట. అయితే మోనిత జైలుకి వెళ్లడం.. తిరిగి రావడం.. బిడ్డకు జన్మనివ్వడం.. మళ్లీ దీప, డాక్టర్ బాబుల మధ్య గ్యాప్ రావడం..ఇవన్నీ కథను ఎటు నుంచి ఎటు తీసుకుని వెళ్లాలో తెలియక.. కావాలనే సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంతైనా సీరియల్‌కి మంచి రేటింగ్‌లో ఉన్నప్పుడు సరైన ముగింపు ఇవ్వడం ఉత్తమం.. రేటింగ్ వస్తుంది కదా అని కంటెంట్ లేని కథని జనంపై బలవంతంగా రుద్దితే రిజల్ట్ ఇలాగే ఉంటుందనే కామెంట్లు చేస్తున్నారు.

కార్తీక దీపం విశేషాలు… కార్తీక దీపం ఒక భారతీయ తెలుగు బుల్లితెర ధారావాహిక.. ఇది ప్రముఖ ఛానెల్లో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది. హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులు. ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుండి రేటింగ్స్ చార్టులో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది. ఈ సీరియల్ మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతు సీరియల్ ఆధారంగా నిర్మించబడింది. తెలుగు తర్వాత కన్నడ, తమిళ, మరాఠీలో కూడా ప్రారంభమైన కరుతముతు ఆధారిత సీరియల్స్‌. స్వచ్ఛమైన హృదయం ఉన్న మంచి అమ్మాయి దీప (ప్రేమి విశ్వనాథ్) జీవితం చుట్టూ తిరిగే కథే కార్తీక దీపం. అయితే, ఆమె నల్లటి చర్మం రంగు కారణంగా ఆమె అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. డాక్టర్ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) తో దీపకు వివాహం జరుగుతుంది. కానీ ఒక అనుమానం వల్ల దీప, కార్తీక్ విడిపోతారు. 8 ఏళ్ళుగా ఎడబాటుగా ఉంటున్నవాళ్ళు మళ్ళీ ఎలా కలుసుకుంటారో అనేది ప్రస్తుతం జరుగుతున్న కథ.

ప్రస్తుతం ప్రసారమవుతున్న స్టోరీలో దీప.. కార్తీక్ చనిపోయి.. కొత్త తరాన్ని తీసుకువచ్చాడు దర్శకుడు. దీప. కార్తీక్ పిల్లలు సౌర్య, హిమ పెద్దవాళ్లు కావడం..తన తల్లిదండ్రుల చావుకు కారణం హిమే అంటూ తనపై సౌర్య పగ పెంచుకోవడం.. వీరిద్దరి భవిష్యత్తులో ఎలాంటి పరిణాలు చోటు చేసుకోబోతున్నాయి. పగ.. ప్రేమగా మారుతుందా అనేది ట్విస్టులతో మరోసారి ప్రేక్షకుల ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు డైరెక్టర్.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?

OTT Platforms: ఓటీటీ వేదికపై సందడి చేయనున్న పెద్ద సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ డేట్స్ ఏంటంటే..

Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్‌ ట్రీట్‌.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..

RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ